Cooking Oil | నలుగురు.. 4 లీటర్లకు మించి నూనె వాడుతున్నారా..? ఆ రోగాలు కొని తెచ్చుకున్నట్టే..!
Cooking Oil | మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులున్నారా..? అయితే నెలకు ఏ మోతాదులో నూనె( Cooking Oil ) వినియోగిస్తున్నారు..? గరిష్ఠంగా 4 లీటర్లకు మించి నూనె వాడితే అనేక రోగాలను( Diseases ) కొని తెచ్చుకున్నట్టే అని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు.
Cooking Oil | పూర్వకాలంలో నూనె( Cooking Oil ) వినియోగం చాలా తక్కువగా ఉండేది. తక్కువ మోతాదులో నూనె వినియోగించేవాళ్లు. కొన్ని సందర్భాల్లో నూనె లేకుండానే వంటలు చేసుకుని తినేవారు. కాబట్టి మన పూర్వీకులు బలంగా ఉండేవారు. వారికి గుండె జబ్బులు( Heart Diseases ), షుగర్( Sugar ), బీపీ( BP ) వంటి రోగాలు దరి చేరేవి కావు. కానీ నేడు నూనె( Cooking Oil ) లేనిది వంట చేయడం అసాధ్యం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రుచి( Taste )కి అలవాటు పడడంతో నూనెను అధిక మోతాదులో వినియోగిస్తే చిన్న వయసులోనే అనేక రోగాలను( Diseases ) కొని తెచ్చుకుంటున్నారు. మరి ఏ మోతాదులో నూనె వినియోగించాలి..? పదేపదే మరిగించిన నూనెను వినియోగించొచ్చా..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్( ICMR ) సిఫార్సుల ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 20 మి.లీ.(నాలుగు టేబుల్ స్పూన్స్) మించకుండా నూనె వాడాలి. ఈ లెక్కన.. నలుగురు సభ్యులున్నా కుటుంబం కేవలం నెలకు కనిష్ఠంగా 2.5 లీటర్లు, గరిష్ఠంగా 4 లీటర్లకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. మనం చేసే వంటకాల్లో నూనె ఎక్కువైతే ఒబెసిటీ, గుండె సంబంధ సమస్యలతో పాటు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నూనెను అధికంగా వాడడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ( Digestive System )పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇన్సులిన్( Insulin ) సమస్యలను పెంచడం వల్ల డయాబెటిస్( Diabetes ) దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో నూనెను వినియోగించడం వలన చిన్న వయసులోనే ఇన్ని రోగాలను కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరిస్తున్నారు.
పదే పదే నూనెను మరిగిస్తే..?
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. పొంగుతున్న, రంగు మారినా నూనెను అస్సలు ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. వంటనూనెను ఒకటి, రెండుసార్లే వేడి చేయాలి. అంతకంటే మించి మరిగిస్తే హానికర సమ్మేళనాలను నూనె విడుదల చేస్తుంది. నూనెను పదేపదే మరిగిచడం వల్ల అందులో ట్రాన్స్ఫ్యాట్స్ ఏర్పడతాయి, ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. పదేపదే వేడి చేసే వంట నూనెలు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAH)తో సహా వివిధ రకాల సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి, వీటిలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram