Health Tips | అరటి తొక్కే కదా.. అని తీసి పారేయొద్దు..!
Health Tips | అరటిపండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరుచూ వీటిని తినడం ద్వారా కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. సాధారణంగా అరటిపండును తినే సమయంలో పైన ఉండే తొక్కను తీసిపడేస్తుంటారు. ఈ తొక్కలతోనూ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని, ముఖం అందానికి లాభాలుంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అరటితోక్కతో చర్మం మీద రుద్దడం ద్వారా చర్మానికి మంచి లాభాలుంటాయి. చర్మ సౌందర్యం పొందడానికి, మచ్చలు, మొటిమలు […]

Health Tips | అరటిపండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరుచూ వీటిని తినడం ద్వారా కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. సాధారణంగా అరటిపండును తినే సమయంలో పైన ఉండే తొక్కను తీసిపడేస్తుంటారు. ఈ తొక్కలతోనూ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని, ముఖం అందానికి లాభాలుంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అరటితోక్కతో చర్మం మీద రుద్దడం ద్వారా చర్మానికి మంచి లాభాలుంటాయి.
చర్మ సౌందర్యం పొందడానికి, మచ్చలు, మొటిమలు తగ్గడంతో పాటు వృద్ధాప్యఛాయలను నివారించేందుకు సహాయపడుతుంది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సీ, విటమిన్ బీ6, విటమిన్ బీ12, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి. తద్వారా చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మొటిమలు, ముడతలను తొలగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. తరుచూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అరటిపండు తొక్కతో ముఖాన్ని స్క్రబ్ చేస్తూ వస్తుంటే మంచి లాభాలుంటాయి. అరటిపండు తొక్కలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఇందులో ఉండే అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరస్తుంది. మలబద్ధకం, విరేచనాలు తదితర సమస్యలున నయవుతాయి.