Health tips | మీకు మధుమేహం ఉందా.. అయితే గుండెను పదిలంగా చూసుకోండి..!

Health tips : ఇతరులతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జ‌బ్బుల బారినప‌డే ప్రమాదం ఎక్కువ‌. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో పెట్టుకోవాలి. డ‌యాబెటిస్ లేని వారితో పోల్చితే డ‌యాబెటిస్ ఉన్న వారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం రెండింత‌లు ఎక్కువ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు కూడా తేల్చాయి.

Health tips | మీకు మధుమేహం ఉందా.. అయితే గుండెను పదిలంగా చూసుకోండి..!

Health tips : ఇతరులతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జ‌బ్బుల బారినప‌డే ప్రమాదం ఎక్కువ‌. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో పెట్టుకోవాలి. డ‌యాబెటిస్ లేని వారితో పోల్చితే డ‌యాబెటిస్ ఉన్న వారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం రెండింత‌లు ఎక్కువ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు కూడా తేల్చాయి. కాబ‌ట్టి గుండెను కాపాడుకోవాలంటే ముందుగా షుగ‌ర్ వ్యాధిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. షుగ‌ర్‌ను అదుపు చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆరోగ్యక‌ర‌మైన డైట్‌

డ‌యాబెటిస్ వ్యాధి ఉన్నవారు తాము తీసుకోవాల్సిన, తీసుకోగూడ‌ని ఆహారాల‌ను గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఫుడ్స్‌, షుగ‌ర్ స్థాయిలు అధికంగా ఉండే ఫుడ్ ఐట‌మ్స్, ప్రాసెస్ చేసిన ఆహార ప‌దార్థాల‌ను అస్సలు తీసుకోక‌పోవ‌డం ఉత్తమం.

2. శారీరక వ్యాయామం

షుగ‌ర్ స‌మ‌స్య ఉన్నవారు రోజుకు క‌నీసం 30 నిమిషాల‌కు త‌గ్గకుండా వ్యాయామం చేయ‌డం అవ‌స‌రం. యోగాస‌నాలు వేయ‌డం, ఎక్సర్‌సైజ్‌లు చేయ‌డం ద్వారా ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

3. నిపుణుల ప‌ర్యవేక్షణ‌లో మెడికేషన్‌

షుగర్‌ మెడిసిన్‌ ఎలా పడితే అలా వాడకూడదు. ఎండోక్రైనాలజిస్ట్‌ లేదా డ‌యాబెటాలజిస్ట్‌ను సంప్రదించి వారు రాసిన మెడికేషన్‌ మాత్రమే తీసుకోవాలి. అంతేగాక మెడిసిన్‌ వైద్యుడు చెప్పిన సమయానికి తీసుకోవాలి. స‌మ‌య‌పాల‌న‌, రెగ్యులారిటీ లేకుండా ఔష‌ధాల‌ను వినియోగించ‌డంవ‌ల్ల స‌రైన ఫ‌లితం ఉండ‌దు.

4. బ‌రువును అదుపులో ఉంచ‌డం

షుగ‌ర్ పేషెంట్‌లు కొంద‌రు వెయిట్ లాస్ అయితే, మ‌రి కొంత‌మంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఇవి రెండూ ప్రమాద‌క‌ర‌మే. కాబ‌ట్టి బ‌రువును అదుపులో పెట్టుకోక‌పోతే గుండె జ‌బ్బుల బారిన‌ప‌డే ప్రమాదం ఉన్నది.

5. కండ్లను కాపాడుకోవడం

డ‌యాబెటిస్ అదుపు త‌ప్పితే కంటి స‌మ‌స్యలు వ‌చ్చే ప్రమాదం కూడా ఉన్నది. కాబ‌ట్టి రెగ్యుల‌ర్‌గా కంటి ప‌రీక్షలు చేయించుకోవాలి. లేదంటే కంటి లోప‌లి భాగాలు దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

6. మూత్ర ప‌రీక్షలు

షుగ‌ర్ పేషెంట్లు క్రమం తప్పకుండా మూత్ర ప‌రీక్షలు చేయించుకోవాలి. దీనివ‌ల్ల ప్రొటీన్ లీకేజీ ఏమైనా ఉన్నదా, సీరమ్ క్రియాటినైన్ ఎంత ఉన్నది అనే వివ‌రాలు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్యత్తులో కిడ్నీ స‌మ‌స్యలు రాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చు.