Health tips | బరువు బాగా పెరుగుతున్నారా.. అయితే తరచూ ఈ పండ్లు తినాల్సిందే..!

Health tips : శ‌రీరంలో కొవ్వు పేరుకోవ‌డంవ‌ల్ల ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరుగుతున్నారు. ప్రస్తుత జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్రధాన కార‌ణం. బ‌రువు పెరగకూడదన్నా, పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవాలన్నా మ‌న జీవ‌న విధానంతోపాటు ఆహారపు అల‌వాట్లను మార్చుకోవాలి.

Health tips | బరువు బాగా పెరుగుతున్నారా.. అయితే తరచూ ఈ పండ్లు తినాల్సిందే..!

Health tips : శ‌రీరంలో కొవ్వు పేరుకోవ‌డంవ‌ల్ల ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరుగుతున్నారు. ప్రస్తుత జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్రధాన కార‌ణం. బ‌రువు పెరగకూడదన్నా, పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవాలన్నా మ‌న జీవ‌న విధానంతోపాటు ఆహారపు అల‌వాట్లను మార్చుకోవాలి. అంటే శ‌రీరంలో కొవ్వుకు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలను దూరం పెడుతూ, కొవ్వు త‌గ్గించే ఆహార ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకోవాలి. కొవ్వును తగ్గించడంలో కొన్ని ర‌కాల పండ్లు బాగా పనిచేస్తాయి. మ‌రి కొవ్వు కరిగించే ఆ పండ్లేమిటో తెలుసుకుందాం..!

బరువు తగ్గించే పండ్లు

కమలా పండ్లు : ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాక విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తినడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు.

కివీ పండ్లు : శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. కొలెస్టరాల్‌ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

అరటి పండ్లు : ఏ సీజన్‌లో అయినా దొరికే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా బ‌రువు త‌గ్గొచ్చు. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండడంతో ఇవి తిన్న త‌ర్వాత చాలాసేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. త‌క్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువ శ‌క్తి పొందే అవ‌కాశం ఉన్నందున వీటితో బ‌రువు పెరిగే అవ‌కాశ‌మే లేదు.

ఆపిల్ పండ్లు : ఈ పండ్లు తీసుకోవడంవ‌ల్ల రక్త ప్రసరణ మెరుగుప‌డుతుంది. అంతేగాక‌ ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబ‌ట్టి ఈ పండ్లు త‌ర‌చూ తిన‌డంవ‌ల్ల కూడా సులువుగా బరువు త‌గ్గవ‌చ్చు.

పుచ్చ పండ్లు : అధికంగా నీటి శాతం వుండే ఈ పండ్లను తినడంవల్ల అవ‌లీల‌గా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో కేల‌రీస్ చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.

బెర్రీ పండ్లు : యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్‌ని తీసుకోవడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శ‌రీర‌ బరువూ తగ్గుతుంది.

ద్రాక్ష పండ్లు : ఈ ద్రాక్ష పండ్లలో కూడా నీటి శాతం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఈ పండ్లు కూడా శ‌రీర బ‌రువు త‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి.