Remedies for Acidity | ‘అసిడిటీ’తో బాధపడుతున్నారా..? ‘బెండకాయ’ ఉన్నాక బెంగ ఎందుకు..?
Remedies for Acidity | అసిడిటీ(Acidity ) బాధపడుతున్నారా..? దీని వల్ల రోజంతా ఇబ్బంది పడుతున్నారా..? అసిడిటీ(Acidity ) సమస్యకు చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. బెండకాయ( Lady's finger )తో అసిడిటీ సమస్యను నయం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Remedies for Acidity | బెండకాయ( Lady’s finger ).. ఇందులోనూ లేత బెండకాయ నిగనిగలాడుతుంది. ఆ బెండకాయలను చూస్తుంటే.. తినేయాలనిపిస్తుంటుంది. కొందరైతే పచ్చి బెండకాయలను నమిలేస్తుంటారు. ఈ కూరగాయ( Vegetable ) సీజన్‌తో సంబంధం లేకుండా దొరుకుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెండకాయకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది.
బెండకాయ ఫ్రై( Lady’s finger Fry ), కర్రీ, పులుసు చేసుకుని ఆరగిస్తుంటారు. ఇలా ఎలా వండుకున్నా బెండకాయ భలే టెస్టీగా ఉంటుంది. రుచి ఒక్కటే కాదు.. బెండకాయతో బోలేడు లాభాలు ఉన్నాయి. బెండకాయను తినడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. అంతేకాదు.. పలు అనారోగ్య సమస్యలను( Health Issues ) కూడా మన దరి చేరనీయదు బెండకాయ. మరి ముఖ్యంగా అసిడిటీ( Acidity )తో బాధపడే వారు బెండకాయను మెనూలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు( Health Experts ) సూచిస్తున్నారు.
బెండకాయతో అసిడిటీని నివారించడం ఎలా..?
ఓ రెండు లేత బెండకాయలను తీసుకొని.. శుభ్రంగా కడగండి. వాటిని నిలువునా రెండు భాగాలు చేయండి. చివర్లో కొంచెం కట్ చేయకుండా అలానే వదిలేయండి. అనంతరం కట్ చేసిన బెండకాయలను ఓ గ్లాస్‌లో ఉంచండి. గ్లాస్‌ను నీటి( Glass Water )తో నింపండి. బెండకాయలు ఉన్న గ్లాస్‌ను ఓ మూతతో కప్పి ఉంచండి. రాత్రంతా ఆ బెండకాయలు నీటిలో నానుతాయి. పొద్దున్నే గ్లాస్‌లో నుంచి బెండకాయలను తీసేసి.. ఆ నీటిని పరగడుపునా తాగాలి. ఇలా చేయడం వల్ల పేగులు, జీర్ణాశయం శుభ్రం అవుతాయి. అల్సర్లు ఉంటే కూడా మాయమవుతాయి. ప్రధానంగా అసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మలబద్దకం సమస్య ఉంటే కూడా పరిష్కారమవుతుంది.
బెండకాయలో సమృద్ధిగా పోషకాలు
ఎంతో మృదువుగా కనిపించే బెండకాయలో ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషయం, పాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో శరీరానికి చక్కని పోషణ అందుతుంది. రక్తం సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ తగ్గుతుంది. మధుమేహం నయమవుతుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. వేడి శరీరం ఉన్న వారు తాగితే శరీరం చల్లబడుతుంది.
బరువు కూడా తగ్గుతారు..
ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గుతారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram