బీట్‌రూట్‌ తింటున్నారా.. ? ఈ వ్యాధులతో బాధపడేవారు అస్సలు తినకూడదు..! అవేంటో తెలుసుకోండి..!

Beetroot Side Effects | బీట్‌రూట్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. కూరగాయల్లో అన్నింటికన్నా బీట్‌రూట్‌ మెరుగ్గా పని చేస్తుంది. రోజూ బీట్‌రూట్‌ తింటూ వస్తుంటే అనారోగ్యాన్ని బీట్‌ చేస్తారు. బరువు తగ్గాలన్నా.. రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేసుకోవాలన్నా బీట్‌రూట్‌ తప్పక తినాల్సిందే. అలాగే విటమిన్‌-బీ, విటమిన్‌-సీ, ఫాస్పరస్‌, కాల్షియం, ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ తదితర పోషకాలుంటాయి. దీంతో ఎన్ని ప్రయోజనాలు, లాభాలు ఉన్నా కొన్నిసార్లు దుష్ప్రభావాలు సైతం ఉంటాయి. ఇందులో ఉండే […]

బీట్‌రూట్‌ తింటున్నారా.. ? ఈ వ్యాధులతో బాధపడేవారు అస్సలు తినకూడదు..! అవేంటో తెలుసుకోండి..!

Beetroot Side Effects | బీట్‌రూట్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. కూరగాయల్లో అన్నింటికన్నా బీట్‌రూట్‌ మెరుగ్గా పని చేస్తుంది. రోజూ బీట్‌రూట్‌ తింటూ వస్తుంటే అనారోగ్యాన్ని బీట్‌ చేస్తారు. బరువు తగ్గాలన్నా.. రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేసుకోవాలన్నా బీట్‌రూట్‌ తప్పక తినాల్సిందే. అలాగే విటమిన్‌-బీ, విటమిన్‌-సీ, ఫాస్పరస్‌, కాల్షియం, ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ తదితర పోషకాలుంటాయి. దీంతో ఎన్ని ప్రయోజనాలు, లాభాలు ఉన్నా కొన్నిసార్లు దుష్ప్రభావాలు సైతం ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కొన్ని వ్యాధులతో బాధపడే వారు బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు. ఏయే సమస్యలతో బాధపడిన సమయంఓ బీట్‌రూట్‌ను తినకూడదో ఓసారి తెలుసుకుందాం రండి..!

షుగర్‌ పేషెంట్లకు హానికరం

మధుమేహ బాధితులు బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు. దీన్ని తీసుకుంటో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకు షుగర్‌ పేషెంట్లు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. పీచుపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. బీట్‌రూట్‌ తినడం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దీన్ని తీసుకోకపోవడం ఉత్తమం.

లో బీపీ ఉన్న వారు..

బీపీ కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు.. అయితే అధ్యయనాల ప్రకారం బీట్‌రూట్ రసం సిస్టోలిక్, డయాస్టోలిక్ రెండింటి స్థాయిలను తగ్గిస్తాయని తేలింది. బీట్‌రూట్‌లో నైట్రేట్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా మారుస్తుంది. దీని కారణంగా రక్తపోటు తగ్గుతుంది. అందుకే లో బీపీతో బాధపడే వారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి.

కిడ్నీలో రాళ్లను పెంచుతాయి

ఆక్సలేట్ కలిగి ఉండే వ్యక్తుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. వాస్తవానికి బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే స్టోన్స్‌ సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండడం మంచిది.

కాలేయానికి ప్రమాదకరం

బీట్‌రూట్‌ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది పలు అధ్యయనాల్లో తెలింది. అయితే, ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజాలు కాలేయంలో పేరుకుపోతాయి. ఫలితంగా కాలేయ సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అలెర్జీ కారణం..

కొందరిలో బీట్‌రూట్‌ తీసుకుంటే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. దురద, చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం సైతం వస్తుంది. మరికొందరిలో బీట్‌రూట్‌ తిన్న తర్వాత గొంతు వద్ద దురద వస్తుంది. ఈ క్రమంలో అలర్జీలతో బాధపడేవారు బీట్‌ను ఏమాత్రం తినకూడదు.