Rainy Season Health Tips | ఈ ఇన్‌ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?

వర్షాకాలం.. ఉల్లాసాన్నే కాదు.. ఇన్ ఫెక్షన్లనూ మోసుకొస్తుంది. నీటిలో కలిసే బ్యాక్టీరియా, వైరస్‌లు, సీజనల్ ఇన్‌ఫెక్షన్లు ఈ కాలంలో సర్వసాధారణం. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్, హేపటైటిస్, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా కనబడతాయి. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్య రక్షణకు కీలకమైనది – మన ఇమ్యూనిటీ సిస్టమ్. దీన్ని బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో వైద్యులందిస్తున్న సూచనలు..

  • By: TAAZ |    health |    Published on : Jul 28, 2025 4:20 PM IST
Rainy Season Health Tips | ఈ ఇన్‌ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?

Rainy Season Health Tips | వర్షాకాలం.. ఉల్లాసాన్నే కాదు.. ఇన్ ఫెక్షన్లనూ మోసుకొస్తుంది. నీటిలో కలిసే బ్యాక్టీరియా, వైరస్‌లు, సీజనల్ ఇన్‌ఫెక్షన్లు ఈ కాలంలో సర్వసాధారణం. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్, హేపటైటిస్, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా కనబడతాయి. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్య రక్షణకు కీలకమైనది – మన ఇమ్యూనిటీ సిస్టమ్. దీన్ని బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో వైద్యులందిస్తున్న సూచనలు..

మన శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షించే సైనిక బలగమే “ఇమ్యూనిటీ సిస్టమ్”. ఇది బలంగా ఉంటేనే సూక్ష్మ జీవుల దాడిని ఎదుర్కోగలుగుతాం.

ఇమ్యూనిటీ పెంచే చిట్కాలు:

ఆహారం:
– విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ, మొసంబి, బెల్లం, పండ్లు తీసుకోండి.
– అల్లం, వెల్లుల్లి, మిరియాల వంటివి వాడాలి.
– ఉడికించిన తాజా ఆహారమే తీసుకోండి. స్ట్రీట్ ఫుడ్ కి దూరంగా ఉండండి.
– వేడి పాలను తులసి ఆకులతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నీరు :
వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమవుతుంది. తాగడానికి కచ్చితంగా బాగా మరిగించి, చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే వాడాలి.

వ్యాయామం, యోగా :
రోజూ కనీసం 30 నిమిషాలు యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసకోశాలు బలపడతాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

శుభ్రతే రక్షణ:
వర్షంలో తడిసిపోయి వచ్చినప్పుడు, వెంటనే స్నానం చేయాలి. చేతులు తరచూ కడుక్కోవాలి.

స్మార్ట్ స్లీప్:
రాత్రి కనీసం 7 గంటల నిద్ర అవసరం. నిద్ర లోపిస్తే ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి మంచి నిద్రే ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ కవచం.

ఇమ్యూనిటీ పెంచడం అనేది ఒక్క రోజు మ్యాజిక్ కాదు… మన జీవనశైలిలో మార్పు వల్లే అది సాధ్యమవుతుంది. జలుబుతో కాదు, ఉత్సాహంతో ఉండాలంటే – శరీరానికి అవసరమైన పోషకాలు, నిద్ర, వ్యాయామం తప్పనిసరి!