Weight Loss | బరువు తగ్గాలనుకుంటున్నారా..? ధనియాల నీళ్లను తాగేయండి..!
Weight Loss | రోజురోజుకు బరువు పెరిగిపోతున్నారా..? బరువు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతుంటాయి. చాలా రకాల సమస్యలకు దారి తీస్తుంది. మరి బరువు తగ్గేందుకు మన ఇంట్లో ఉండే ధనియాలు కూడా ఎంతో సహకరిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు ధనియాల నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ధనియాల నీళ్లను ఎలా తయారు చేయాలంటే..? మొదటగా ఒక స్పూన్ ధనియాల గింజలను ఒక గ్లాసు నీటిలో […]
Weight Loss | రోజురోజుకు బరువు పెరిగిపోతున్నారా..? బరువు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతుంటాయి. చాలా రకాల సమస్యలకు దారి తీస్తుంది. మరి బరువు తగ్గేందుకు మన ఇంట్లో ఉండే ధనియాలు కూడా ఎంతో సహకరిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు ధనియాల నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ధనియాల నీళ్లను ఎలా తయారు చేయాలంటే..?
మొదటగా ఒక స్పూన్ ధనియాల గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దునే ఆ మిశ్రమాన్ని వడపోయాలి. ఇక ధనియాల ద్రావణంలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగాలి. తేనె లేకున్నా నష్టం లేదు. ఇలా ధనియాల రసం తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
ధనియాల రసం తాగడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరగడుపున ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. అంటే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు విసర్జితమవుతాయి. ధనియాల్లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
దీంతో చర్మం కూడా నిగనిగలాడుతుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనియాల నీళ్లలో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.. కాబట్టి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు ఎలర్జీ కారకాలను కూడా తొలగిస్తాయి.
మన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత చాలా అవసరం. ఎలెక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడంలో ధనియాలు ముందుంటాయి. గోరువెచ్చగా ఉండే ధనియాల నీరు తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది.
పొట్ట ఉబ్బరం, పొట్ట అసౌకర్యం వంటివి తగ్గుతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram