Dementia | సెక్స్ లైఫ్ సరిగా లేకపోతే పురుషులకు ‘డిమెన్షియా’ జబ్బు
విధాత: శృంగార జీవితం దెబ్బ తింటే వివాహ బంధంలో సమస్యలు, గుండెపోటు మొదలైనవి వస్తాయని ఇప్పటి వరకు తెలిసున్న విషయమే. మధ్య వయసు పురుషులు సెక్స్ లైఫ్‌ను నిర్లక్ష్యం చేస్తే వారు డిమెన్షియా (Dementia), చిత్తవైకల్యం బారిన పడే ప్రమాదముందని ఓ అధ్యయనం తాజాగా తేల్చింది. వయసు యాభైల్లో ఉన్న 818 మంది పురుషులపై పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని పదేళ్ల పాటు సాగించారు. ఈ కాలంలో వారి సెక్స్ […]
విధాత: శృంగార జీవితం దెబ్బ తింటే వివాహ బంధంలో సమస్యలు, గుండెపోటు మొదలైనవి వస్తాయని ఇప్పటి వరకు తెలిసున్న విషయమే. మధ్య వయసు పురుషులు సెక్స్ లైఫ్‌ను నిర్లక్ష్యం చేస్తే వారు డిమెన్షియా (Dementia), చిత్తవైకల్యం బారిన పడే ప్రమాదముందని ఓ అధ్యయనం తాజాగా తేల్చింది.
వయసు యాభైల్లో ఉన్న 818 మంది పురుషులపై పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని పదేళ్ల పాటు సాగించారు. ఈ కాలంలో వారి సెక్స్ జీవితాన్ని, ఆరోగ్య సమస్యల వివారలను క్రోడీకరించారు. ఆ ఫలితాల ప్రకారం.. శృంగారంలో పాల్గొంటూ సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారి కంటే చేయని వారు త్వరగా తమ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని గుర్తించారు.
సెక్స్ చేయకపోవడం వల్ల వచ్చే ఆందోళనతో మెదడులోని ఒక భాగం బలహీనపడటమే దీనికి కారణమని కొందరు చెప్పగా.. గుండె బలహీనపడటం వల్ల కూడా మెదడు తన శక్తిని కోల్పోతుందని మరికొందరు పరిశోధకులు పేర్కొన్నారు.

అధ్యయనం జరిగిందిలా..
జెంటోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన వివరాల ప్రకారం… 1965 నుంచి 1975 వరకు యూఎస్ మిలటరీలో పనిచేసిన వారిపై ఈ పరిశోధన చేశారు. అధ్యయనం మొదలుపెట్టేటపుడు వారి సగటు వయసు 56 ఉండగా ప్రస్తుతం 68గా ఉంది. ప్రారంభంలో ఎవరికీ అంగ స్తంభన సమస్యలు కానీ జ్ఞాపకశక్తి సమస్యలు కానీ లేవు. వీరిని అధ్యయనం ప్రారంభంలో ఒక సారి తర్వాత ప్రతి ఆరేళ్లకు మరోసారి పరిశీలించి ఆరోగ్య రికార్డులు తీసుకున్నారు.
శృంగారంలో వారు పొందుతున్న ఆనందం, ఎన్ని బంధాల్లో ఉన్నారు? ఎంత సేపు పాల్గొన్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అంతే కాకుండా జ్ఞాపకశక్తి ని అంచనా వేయడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ వచ్చారు. ప్రారంభంలో అంగస్తంభన సామర్థ్యం తక్కువగా ఉన్న వారు చివరికొచ్చేటప్పటికి పూర్తిగా నీరు కారిపోవడంతో.. వారు సెక్స్‌లో పాల్గొనలేకపోయారు. వీరికి మిగిలిన వారితో పోలిస్తే జ్ఞాపకశక్తి ఎక్కువగా మందగించి డిమెన్షియా బారిన పడ్డారని పరిశోధకులు గుర్తించారు.
దీనిని బట్టి మన సెక్స్ లైఫ్‌కు మెదడు ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉందని అర్థమవుతోందని పరిశోధన బృందంలో ఒకరైన డా.రికీ స్లేడే వెల్లడించారు. 70 ఏళ్ల ముందు గనక అంగ స్తంభన సమస్య ఎదురైతే.. జ్ఞాపకశక్తి క్షీణిస్తోందనడానికి శరీరం ఇచ్చే సంకేతంగా భావించాలని ఆయన అన్నారు. అయితే శృంగారంలో తక్కువగా పాల్గొనే మహిళల్లోనూ ఈ సమస్య తలెత్తుందా లేదా అనేది ఈ పరిశోధన వెల్లడించలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram