Diabetes | మధుమేహం బాధితుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందా? అధ్యయనంలో ఏం తేలిందంటే..?

diabetes | మధుమేహం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధి. దీంతో శరీరం అనేక దుష్ప్రభావాలకు గురవుతుంది. రక్తంలో షుగర్‌ స్థాయి పెరగడం వల్ల కళ్లు, కిడ్నీలు, జీర్ణ సంబంధిత సమస్యలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం

Diabetes | మధుమేహం బాధితుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందా? అధ్యయనంలో ఏం తేలిందంటే..?

Diabetes | మధుమేహం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధి. దీంతో శరీరం అనేక దుష్ప్రభావాలకు గురవుతుంది. రక్తంలో షుగర్‌ స్థాయి పెరగడం వల్ల కళ్లు, కిడ్నీలు, జీర్ణ సంబంధిత సమస్యలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆరోగ్యంపై అనేక విధాల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మధుమేహం సంతానోత్పత్తిని సైతం ప్రభావం చేస్తుందా? అనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతూ ఉంటుంది.

శరీరంపై మధుమేహం దుష్ప్రభావాలను తెలుసుకునేందుకు నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో బ్లడ్‌లో చక్కెర లెవెల్స్‌ పెరిగిన సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు పెరుగుతున్నట్లు తేలింది. డయాబెటిస్‌తో బాధపడుతున్న స్త్రీ, పురుషులిద్దరిలో పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ప్రతి ఒక్కరూ మధుమేహం బారినపడకుండా తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సంతానోత్పత్తిపై షుగర్‌ ఎలా ప్రభావం చూపుతుందో ఓ సారి తెలుసుకుందాం..

పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం

మధుమేహం కొంతమంది పురుషుల్లో వీర్యకణాల నాణ్యతను ప్రభావితం చేస్తుందని పరిశోధనల్లో గుర్తించారు. మధుమేహంతో బాధపడుతున్న పురుషులపై, మధుమేహం లేని పురుషులతో పోలిస్తే.. షుగర్‌ వ్యాధిగ్రస్తులు పురుష హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి తక్కువగా ఉందని తేలింది. అలాగే, పురుషుల్లో అంగస్తంభన కష్టతరంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు.

దీనిపై ప్రభావం సంసార జీవితంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం స్పెర్మ్ క్వాలిటీని సైతం తగ్గిస్తుంది. మధుమేహం స్థితి హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే, ప్రతి ఒక్కరిలో ఈ రకమైన ప్రమాదం ఉండదని పేర్కొన్నారు.

లైంగిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలు..

డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యకుల్లో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ గౌతమ్‌ తుషార్‌ తెలిపారు. ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నరాల దెబ్బతినడానికి కారణమవుతాయని, ఈ రకమైన సమస్య అంగస్తంభన ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. మధుమేహం స్పెర్మ్ నాణ్యతను తగ్గించవచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అయితే, స్పెర్మ్ చలనశీలత తగ్గతుంది. స్పెర్మ్ చలనశీలత అనేది యోని, అండాశయాల ద్వారా గుడ్డును చేరుకోవడానికి.. దాన్ని ఫలదీకరణం చేయడానికి స్పెర్మ్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. చలనశీలత రేటు తక్కువగా ఉన్నప్పుడు, స్పెర్మ్ పెద్ద సంఖ్యలో ఉండవచ్చు కానీ ముందుగా గుడ్డును చేరుకోవడంలో విఫలమవుతుంది. అయితే, చలనశీలతకు సంబంధించి తక్కువగానే ఆధారాలున్నాయని పేర్కొంటున్నారు.

మహిళల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం..

మధుమేహం మహిళల్లో అనేక రకాల లైంగిక ఆరోగ్య సంబంధిత సమస్యలు పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ పెరగడం వల్ల యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇదే కాకుండా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) జననేంద్రియాల వద్ద దురద, ఇన్ఫెక్షన్‌ ప్రమాదం డయాబెటిస్‌తో బాధపడుతున్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

నిపుణుల సలహా ఏంటంటే..?

డయాబెటిక్‌ స్త్రీ, పురుషులిద్దరులో పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గౌతమ్ సూచించారు. ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

మధుమేహం, సంబంధిత సమస్యలను, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిక్‌ సమస్కలను నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.