వీటితో కలిపి అరటి పండు తింటే.. అనారోగ్య సమస్యలు తప్పవు
అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు
అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆయర్వేదం ప్రకారం.. అరటిపండుతో పాటు కొన్ని రకాల పదార్థాలు అస్సలు తినకూడదు. అలా తింటే ఎన్నో అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే నిత్యం ఒక అరటిపండు తింటే గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు.
ఆయుర్వేదం ప్రకారం పాలతో కలిపి అరటి పండు అస్సలు తినకూడదు. అరటి పండ్లేమో ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. పాలేమో తియ్యగా ఉంటాయి. ఈ రెండు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, దగ్గు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు.
మాంసాహారంతోపాటు అరటిపండును అస్సలు తినకూడదు. అరటిపండులో ప్యూరిన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కానీ రెడ్ మీట్‌లో ఉండే అధిక ప్రొటీన్ కంటెంట్ జీర్ణక్రియ ప్రక్రిను అడ్డుకుంటుంది. ఈ రెండు పదార్థాలు కలిపి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో గ్యాస్ట్రిక్ సమస్యను వస్తుంది.
చాలా మంది ఉదయం అల్పాహారంలో బ్రెడ్ తోపాటు అరటి పండు తింటుంటారు. అయితే ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, రొట్టెలు, ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అరటి పండు తొందరగా జీర్ణం అవుతుంది. వ్యతిరేక స్వభావం కలిగిన ఈ రెండు ఆహారాలు తినడం వల్ల జీర్ణ అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం, విరుద్ద ఆహార పదార్థాలు తినడం వల్ల వాత, పిత్త, కఫాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే తీపి స్వభావం కలిగిన అరటిపండుతో పాటు నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొదలైన ఆమ్ల లక్షణాలు కలిగిన పండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి అరటిపండ్లు, ఆమ్ల పండ్లను కలిపి తింటే వికారం, తలనొప్పి మొదలైన సమస్యలు తలెత్తుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram