Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. అయితే నోటి క్యాన్సరేమో.. పరీక్షలు చేయించుకోండి..!

Health tips : ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. మారిన జీవనవిధానం, జన్యుపరమైన కారణాలతో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్‌లలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో నోటి క్యాన్సర్ (Mouth Cancer) ఒకటి. ధూమపానం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడంవల్ల నోటి క్యానర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ కూడా ప్రాణాంతకమే అయినా ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడంవల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మనలో కనిపించే కొన్ని లక్షణాలే మనకు నోటి క్యాన్సర్‌ వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తాయి. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవీ లక్షణాలు

  • గొంతులో నిరంతరం నొప్పి, చికాకు, నోరు మందంగా ఉన్నట్టు అనిపించడం లాంటి వాటిని నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. ఏదైనా తిన్నా, తాగినా చాలా అసౌకర్యంగా ఉంటుంది. నోటి లోపల తెల్లటి మచ్చలు, ఎరుపు మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటివి రెండు వారాలకంటే ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
  • అదేవిధంగా గొంతులో ఎప్పుడూ ఏదో ఇరుక్కునట్టుగా ఉంటుంది. దీన్ని డైస్పాగియా అంటారు. ఆహారాన్ని తీసుకున్నప్పుడు మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా నోటి క్యాన్సర్‌కు ఒక సంకేతం.
  • గొంతు బొంగురు పోవడం లేదా మాట్లాడినప్పుడు కరకరమని ధ్వని రావడం వంటివి కూడా నోటి క్యాన్సర్‌ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్ బారిన పడినప్పుడు కూడా గొంతు బొంగురుపోతుంది. అయితే ఇది ఎక్కువకాలం పాటు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.
  • దగ్గు శ్వాస సంబంధిత సమస్య అయినప్పటికీ నిరంతరం వచ్చే దగ్గు, ఎక్కువ కాలంపాటు ఉండే దగ్గు నోటి క్యాన్సర్‌కు సంకేతం. నోటి క్యాన్సర్‌తో బాధపడే వారిలో నమలడం, మింగడం, మాట్లాడడం చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది గనుక ఎక్కువ కాలంపాటు ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.
  • నోరు, పెదవులు, నాలుక లాంటి భాగాలు తిమ్మిరి పట్టినట్టుగా, జలదరించినట్టుగా ఉంటాయి. ఇది కూడా నోటి క్యాన్సర్‌లో కనిపించే ప్రారంభ లక్షణాల్లో ఒకటి. కాబట్టి తిమ్మిర్లు అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షల చేయించుకోవాలి.
  • అంతేగాక దవడను, నాలుకను కదిలించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నోరు కూడా పూర్తిగా తెరవలేరు. ఇది కూడా నోటి క్యాన్సర్‌ లక్షణాల్లో ఒకటి. ఈ లక్షణం మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.