Male Infertility | మ‌గ‌త‌నాన్ని ‘జిమ్’ చంపేస్తుంద‌ట‌..! స్పెర్మ్ కౌంట్ త‌గ్గ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌..!!

Male Infertility | ఫెర్టిలిటీ స‌మ‌స్య‌లు స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ ఉంటాయి. అయితే చాలా వ‌ర‌కు ఆడ‌వారిలోనే ఈ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని అంద‌రూ భావిస్తుంటారు. కానీ మ‌గ‌వారిలో కూడా సంతాన స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. మ‌రి ముఖ్యంగా జిమ్‌( Gym )లో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేవారిలో ఫెర్టిలిటీ స‌మ‌స్య‌లు( Infertility ) అధికంగా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డైంది.

  • By: raj    health    Oct 20, 2024 8:00 PM IST
Male Infertility | మ‌గ‌త‌నాన్ని ‘జిమ్’ చంపేస్తుంద‌ట‌..! స్పెర్మ్ కౌంట్ త‌గ్గ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌..!!

Male Infertility | ఫెర్టిలిటీ స‌మ‌స్య‌లు స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ ఉంటాయి. అయితే చాలా వ‌ర‌కు ఆడ‌వారిలోనే ఈ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని అంద‌రూ భావిస్తుంటారు. కానీ మ‌గ‌వారిలో కూడా సంతాన స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. మ‌రి ముఖ్యంగా జిమ్‌( Gym )లో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేవారిలో ఫెర్టిలిటీ స‌మ‌స్య‌లు( Infertility ) అధికంగా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డైంది. జిమ్ ఎక్కువ చేసే పురుషుల్లో వంధ్య‌త్వ( Male Infertility) స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు గుర్తించారు.

వంధ్య‌త్వానికి జిమ్ కార‌ణమేనా..?

చాలా మంది పురుషులు.. ఉద‌యం, సాయంత్రం వేళ జిమ్‌కు వెళ్తుంటారు. రోజుకు మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు జిమ్‌కే స‌మ‌యం కేటాయిస్తుంటారు. కొంద‌రైతే ఆరేడు గంట‌ల పాటు కూడా వ‌ర్క‌వుట్స్ చేస్తుంటారు. జిమ్‌కు వెళ్లే వారు టైట్‌గా ఉండే దుస్తులు ధ‌రిస్తారు. ఇలా కంటిన్యూ టైట్​గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువ అవుతుందని.. ఇది ఫెర్టిలిటీ సమస్యకు దారి తీస్తుంద‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. సాధార‌ణంగా పురుషుల శ‌రీరం వేడిగానే ఉంటుంది. జిమ్‌లో ఎక్కువ‌గా వ‌ర్క‌వుట్ చేసే వారిలో మ‌రింత వేడి ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో ఆ వేడికి శుక్ర క‌ణాలు చ‌నిపోతాయి. ఈ నేప‌థ్యంలో జిమ్ కు వెళ్ల‌డం త‌గ్గించి, వ‌దులుగా ఉండే దుస్తులు ధ‌రిస్తే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. జిమ్‌కు త‌క్కువ స‌మ‌యం కేటాయించి, వ‌దులు దుస్తులు ధ‌రించిన వారిలో స్పెర్మ్ సంఖ్య పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. దాని నాణ్యత కూడా పెరిగిందని చెప్తున్నారు. అంటే అధిక స‌మ‌యం జిమ్‌లో గ‌డిపే వారిలో స్పెర్మ్ కౌంట్ పూర్తిగా త‌గ్గిపోవ‌డ‌మే కాకుండా.. సంతానోత్ప‌త్తికి హానీక‌ర‌మ‌ని తేలింది.

టెస్టోస్టెరాన్ థెరపీ..

హైపోథాలమస్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ పనితీరు, ఆక్సీకరణ ఒత్తిడిలో పెరుగుదల, మంట వంటివి మగవారిలో ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటివల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల వీర్యం నాణ్యత తగ్గుతుందని.. క్రమంగా అది వంధ్యత్వానికి దారితీస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టెస్టోస్టిరాన్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు టెస్టోస్టెరాన్ రిప్లేస్​మెంట్ థెరపీలు తీసుకోవచ్చని కూడా సూచించారు.

లైఫ్ స్టైజ్ ఛేంజ్‌తో..

తగినంత నిద్రపోవడం, జింక్, మెగ్నీషియం ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం.. శుభ్రమైన, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే జిమ్​కోసం ఎక్కువ కష్టపడటం కాకుండా.. పరిమితిగా దానిని చేయాలని సూచిస్తున్నారు. అలాగే శరీరంలో కొత్త స్పెర్మ్ క్రియేట్ అవ్వడానికి దాదాపు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఈలోపు లైఫ్​ స్టైల్ ఛేంజ్ చేసుకుంటే ఈ మార్పులు మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్తున్నారు.

ఏడు జంట‌ల్లో ఒక‌రికి వంధ్య‌త్వం..!

నిపుణలు అభిప్రాయం ప్రకారం యూకేలోని 7 జంటల్లో ఒకరిని వంధ్యత్వం ప్రభావితం చేస్తోందట. యూకేలో జరిపిన అధ్యయనంలో సంతానోత్పత్తి చికిత్స అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారు. మహిళల్లో అయితే లేట్​ ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, స్టీమ్ బాత్స్, ల్యాప్ టాప్​లు ఎక్కువగా వినియోగించడమనేది సహజకారణాలుగా మారిపోయాయట. అదే మగవారిలో జిమ్​కి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.