H3N2 Virus Hits Delhi-NCR | వణికిస్తున్న హెచ్ 3ఎన్ 2 ఫ్లూ వైరస్
ఢిల్లీ ఎన్సీఆర్ లో H3N2 ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం లక్షణాలతో ప్రజలు బాధితులు.

విధాత: ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంత వాసులతో పాటు పక్క రాష్ట్రాలలో ఇన్ఫ్లూ ఎంజా ఏ కు చెందిన హెచ్ 3ఎన్2 ఫ్లూ వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం వంటి లక్షణాల బాధితులు సంఖ్య పెరిగింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ సర్వే చేయబడిన 69 శాతం కుటుంబాలలో ప్రస్తుతం కోవిడ్, ఫ్లూ, వైరల్ జ్వరం లాంటి లక్షణాలు ఉన్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారని స్థానిక సర్వేలలో వెల్లడైంది. సెప్టెంబర్ 2025 ఫలితాలను.. మార్చి 2025లో సర్వే ఫలితాను పోల్చి చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్ లో ఇన్ఫ్లూ ఎంజా వ్యాప్తి వెల్లడైంది.
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ నివాసితుల నుండి 11,000 కంటే ఎక్కువ మందిని పరిశీలించగా..ఈ సర్వేలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు హెచ్ 3ఎన్2 ఫ్లూ వైరస్ బారిన పడినట్లుగా గుర్తించారు. ఇదోక అంటువ్యాధిలా విస్తరిస్తుందని వెల్లడైంది. ఈ కేసులను పరీక్షించగా..వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని స్పష్టం అవుతుందని ముంబై సెంట్రల్‌లోని వోకార్డ్ హాస్పిటల్స్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రితుజా ఉగల్ముగ్లే మీడియాకు తెలిపారు.