Health Tips | బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆకులతో చెక్ పెట్టండిలా..!
Health Tips | బీపీ( Blood Pressure ), షుగర్( Sugar Patients ) ఉన్నవారు అనేక రకాల మెడిసిన్స్( Medicines ) వాడుతుంటారు. అయితే ప్రకృతిలో దొరికే ఆకులతో కూడా ఈ రెండింటికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips | బిజీ లైఫ్, మానసిక ఒత్తిళ్ల కారణంగా.. చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. ఈ రోగాల్లో ప్రధానంగా అందర్నీ వేధిస్తున్నది.. బీపీ( Blood Pressure ), షుగర్( Sugar Patients ). ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ రోగులు ఉంటున్నారు. ఈ రెండింటితో బాధపడుతూ.. అనేక మెడిసిన్స్( Medicines ) వాడుతుంటారు. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే జామ ఆకు( Guava Leaves )లతో కూడా బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని, వారి సూచనల మేరకు మెడిసిన్స్ వాడాలని సూచిస్తున్నారు.
ఇక జామపండు( Guava Fruit ) విరివిగా లభిస్తుంది. తక్కువ ధర కూడా. జామ పండు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే జామను పేదోడి యాపిల్( Apple ) అని కూడా పిలుస్తుంటారు. షుగర్ ఉన్న వాళ్లు కూడా జామ పండును తినవచ్చు. కేవలం జామ పండే కాకుండా జామ చెట్టు ఆకులు( Guava Leaves ) కూడా ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయని.. దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి జామ ఆకుల్ని తీసుకుంటే ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకులతో షుగర్ కంట్రోల్ సాధ్యమేనా..?
జామ ఆకుల్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే ఫినోలిక్ సమ్మేళనం, యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు జామ ఆకుల్ని నములుతూ ఉంటే చాలా మంచిది.
బీపీ కూడా అదుపులో ఉంటుందా..?
జామ ఆకుల్ని తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంచవచ్చు. జామ పండులో ఉన్నట్టే.. ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తిన్నా, ఆకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది.
జామ ఆకులతో బరువు తగ్గొచ్చా..?
జామ ఆకుల్ని తినడం వల్ల అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.