Health tips | వేసవిలో వడదెబ్బ బారిన పడొద్దంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Health tips : ఎండా కాలంలో సాధారణంగా భానుడు భగ్గున మండుతాడు. ఈ ఎండలవల్ల బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. వేడి మరీ ఎక్కువైతే వడదెబ్బ తగులుతుంది. మరి ఆ పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా..?
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే చిట్కాలు
- ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది.
- సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తాగడంవల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది.
- వేడిచేసే ఆహార పదార్థాలైన పుల్లటి పండ్లు, బీట్‌రూట్‌లు, క్యారెట్‌లను వేసవిలో ఎక్కువగా తినకూడదు.
- దానిమ్మ గింజల్లో శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది.
- అంతేగాక క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
- కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
- మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.
- రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా శరీరం చల్లబడుతుంది.
- రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.