Hibiscus For Hair Growth | ‘మందారం ఆకు’ ఉండగా.. మగాడికి ఎందుకు బాధ..!
Hibiscus For Hair Growth | మందారం ఆకు ( Hibiscus Leaf ), పువ్వు ఉండగా.. మగాడికి ఎందుకు బాధ..! అంటే మీకు విచిత్రం అనిపించొచ్చు. మందారం ఆకుతో, దాని పువ్వులతో( Hibiscus Flowers ) మగాళ్లకు బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. జుట్టు రాలే( Hair Fall ) సమస్య నుంచి మొదలుకుంటే బట్టతలతో( Bald Head ) పెళ్లికి దూరమవుతున్న వారందరికీ మందారం ఆకు ఎంతో ఉపయోగపడుతుంది. గుప్పెడు మందారం ఆకుతో.. మీ జుట్టు రాలిపోవడం, బట్ట తలకు చెక్ పెటొచ్చు.

Hibiscus For Hair Growth | మందారం ఆకు( Hibiscus Leaf ) కు ఆయుర్వేదం( Ayurveda )తో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రసిద్ధ మూలికల్లో ఈ మందారం ఆకు, మందారం పువ్వు( Hibiscus Flowers ) కూడా ఒకటి. మన ఇండ్లలో, పరిసరాల్లో పెరిగే మందారం చెట్టు ఆకులు( Hibiscus Leaves ), అందమైన పువ్వులు అసాధారణమైన వైద్య లక్షణాలను కలిగి ఉన్నాయి.
ఇటీవలి కాలంలో మగాళ్లు జుట్టు రాలే( Hair Fall ) సమస్యతో బాధపడుతున్నారు. ఈ జుట్టు రాలే సమస్యకు మందారం ఆకులు, పువ్వులు సరైన నివారిణి. తలలో చుండ్రు( Dandruff ) ఏర్పడకుండా, జుట్టు రాలకుండా మందారం ఆకులు, పువ్వులు ఉపయోగపడుతాయి. వారంలో ఒకసారి మందారం ఆకు, పువ్వులను కలిపి తలకు పట్టిస్తే.. జుట్టు రాలిపోవడం ఆగిపోయి, బట్టతల( Bald Head ) సమస్యకు చెక్ పెట్టొచ్చని పలు అధ్యయనాల్లో తేలింది.
మందారం ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..( Benefits Of Hibiscus For Hair )
జుట్టు పెరుగుదల( Stimulates hair growth )
ఒకప్పుడు ఒత్తుగా ఉన్న జుట్టు ఇప్పుడు పలుచబడితే దానికి పరిష్కారం మార్గం మందారం ఆకు, పువ్వు ఒక్కటే. ఈ పువ్వుల్లో ఆమైనో ఆమ్లాలు విరివిగా లభిస్తాయి. ఈ ఆమైనో ఆమ్లాలు( Amino Acids ) జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలను జుట్టుకు అందిస్తాయి. ఈ యాసిడ్స్ జుట్టు నిర్మాణానికి అవసరమైన కెరాటిన్( keratin ) అనే స్ట్రక్చరల్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కెరాటిన్ జుట్టను ఒత్తుగా పెంచేందుకు ఉపయోగపడుతుంది.
జుట్టు పొడిగా ఉండేందుకు..( Conditions hair )
జుట్టు పొడిగా ఉండేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే రకరకాల షాంపూలను( shampoos ) వినియోగిస్తుంటారు. ఈ షాంపూలను వినియోగించడం వల్ల జుట్టు నాణ్యతను కోల్పోయి, వెంట్రుకలు రాలిపోయే ఆస్కారం ఉంటుంది. మరి మీ జుట్టు పొడిగా ఉండాలంటే.. అది కేవలం మందారం ఆకుతోనే సాధ్యమని చెప్పొచ్చు. మందార పువ్వులు, ఆకులు అధిక మొత్తంలో శ్లేష్మం కలిగి ఉంటాయి, ఇది సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. తలకు మందారం ఆకు పేస్ట్ పెట్టుకోని తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిగా ఉంటుంది.
బట్ట తల నివారణకు..( Prevents Baldness )
బట్ట తల నివారణకు మందారం ఆకు చక్కటి ఔషధం. ఇది అనేక పరిశోధనల్లో కూడా ధృవీకరించబడింది. జుట్టును ఒత్తుగా ఉంచేందుకు మందారం, ఆకులు పువ్వులు ఉపయోగపడుతాయి. బట్టతల( Bald Head ) చికిత్సకు ఉపయోగించే మందులు.. మినోక్సిడిల్( Minoxidil ), ఫినాస్టరైడ్( Finasteride ) వలె మందార ఆకు కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి నేచురల్‌గా దొరికే మందారం ఆకుతో జుట్టును పెంచుకోవచ్చు. బట్ట తలకు చెక్ పెట్టొచ్చు.
చుండ్రు, దురదకు చెక్..!( Treats Dandruff and Itchy Scalp )
చాలా మంది చుండ్రు( Dandruff ), దురద సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి మందారం ఒక ఆస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుంది. జుట్టుకు మందార ఆకులను ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద సమస్య తగ్గిపోతుంది. జుట్టు యొక్క పీహెచ్‌ను కూడా సమతుల్యం చేస్తుంది.
నలుపు రంగు కోల్పోకుండా..( Prevents Premature Greying )
సాధారణంగా జుట్టు నలుపు రంగులో ఉంటుంది. కొందరికి ఈ జుట్టు తెలుపు లేదా బూడిద రంగులోకి మారుతుంది. అలాంటి వారు మందారం ఆకులను ఉపయోగించాలి. ఎందుకంటే మందారంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టుకు సహజ రంగును ఇచ్చే మెలనిన్( Melanin )ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.