ICMR | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయం బారినపడుతున్నారు. అయితే, అధిక బరువు.. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు సైతం బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే, మీ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సూచనలు చేసింది.
ICMR | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయం బారినపడుతున్నారు. అయితే, అధిక బరువు.. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు సైతం బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే, మీ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సూచనలు చేసింది. బరువును వేగంగా తగ్గించే అన్ని పద్ధతులకు పూర్తి దూరం పాటించడం ముఖ్యమని ఐసీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. వేగంగా బరువు తగ్గడం, ఊబకాయం కోసం మందుల వాడకంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏ సమయంలో ఎంత బరువు తగ్గాలో చెప్పింది. ఐసీఎంఆర్ జారీ చేసిన అడ్వైజరీలో క్రమంగా బరువు తగ్గుతూ రావాలని చెప్పింది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ స్థలాకాయన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచించారు. ఆసియా కట్-ఆఫ్ ప్రకారం.. 23 నుంచి 27.5 కిలోల బీఎంఐ అధిక బరువుగా నిర్వచించబడింది. 30శాతం కంటే ఎక్కువ పట్టణ ప్రజలు మరియు 16శాతం కంటే ఎక్కువ గ్రామీణ వయోజనులు అధిక బరువుతో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో కాలక్రమేణా వివిధ రకాల తీవ్రమైన వ్యాధులను అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. క్రమంగా బరువు తగ్గాలి. వారానికి అర కిలోగ్రాము వరకు బరువు తగ్గడం సురక్షితంగా భావిస్తున్నారు.
వేగవంతమైన బరువు తగ్గే పద్ధతులు, స్థూలకాయాన్ని తగ్గించే మందుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, నడుము భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ శారీరక శ్రమ, యోగా బరువు తగ్గడానికి మంచి మార్గమని.. అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గమని చెప్పింది.
ఈ సందర్భంగా పలు చిట్కాలను సూచించింది. బరువు తగ్గేందుకు ఐసీఎంఆర్ ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి పద్ధతులపై వివరించింది. పచ్చి కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని.. పీచుపదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెప్పింది. తక్కువ కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుందని పేర్కొందు. పోషకాలు అధికంగా ఉండే ఆహార ఎంపిక చేసుకోవాలని.. కొన్ని డ్రై ఫ్రూట్స్, పెరుగు.. సీజనల్ ఫ్రూట్స్ తినాలని చెప్పింది. ఆహారం కోసం ఆరోగ్యకరమైన మంచి నూనెలను తీసుకోవాలని.. ఆలివ్ ఆయిల్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది.