Health tips | పప్పు తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది కాదట.. ఏం జరుగుతుందో తెలుసా..?

Health tips : పప్పు మంచి పోషకాహారం. మన దేశంలో పప్పు వినియోగం అధికంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో శరీరానికి ఎక్కువ పోషకాలను అందించే ఏకైక ఆహారం పప్పు మాత్రమే. అది కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు, మినపపప్పు ఇలా ఏ పప్పు అయినా కావచ్చు.. ఆయా పప్పుల్లో ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి.

Health tips | పప్పు తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది కాదట.. ఏం జరుగుతుందో తెలుసా..?

Health tips : పప్పు మంచి పోషకాహారం. మన దేశంలో పప్పు వినియోగం అధికంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో శరీరానికి ఎక్కువ పోషకాలను అందించే ఏకైక ఆహారం పప్పు మాత్రమే. అది కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు, మినపపప్పు ఇలా ఏ పప్పు అయినా కావచ్చు.. ఆయా పప్పుల్లో ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. శాఖహారులైతే ప్రోటీన్స్‌ కోసం పప్పును కచ్చితంగా తినాల్సిందే. పప్పులో ప్రొటీన్స్‌తోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేగాక విటమిన్‌లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. అందుకే పప్పు తినడం మానేస్తే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పప్పు మానేయడంవల్ల కలిగే అనర్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇవీ నష్టాలు..

  • మనం కొన్నాళ్లపాటు పప్పులు తినకుండా ఉంటే అవసరమైన పోషకాలు అందక బలహీనత వస్తుంది. దాంతో కండరాల నొప్పి, తిమ్మిర్లు లాంటివి కలుగుతాయి.
  • పప్పులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పప్పు మానేయడంవల్ల శరీరానికి కావాల్సినంత ఫైబర్ అందక మలబద్ధకం, అజీర్తి లాంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
  • పప్పు మానేయడంవల్ల కావాల్సిన పోషకాలు అందక ఎముకలు కూడా బలహీనపడతాయి. దాంతో చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతాయి. కాబట్టి తరచూ పప్పును ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.
  • సాధారణంగా కార్బోహైడ్రేట్‌లు వేగంగా జీర్ణమవుతాయి. కానీ పప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా అరుగుతాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి.
  • అంతేగాక తరచూ పప్పు తినడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఎందుకంటే పప్పులో కొవ్వుల శాతం చాలా తక్కువ. దాంతో గుండె జబ్బులు దరిచేరవు.
  • అదేవిధంగా పప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థాల కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటాం. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  • పప్పు ధాన్యాల్లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. దాంతో శరీరం శక్తిమంతంగా మారుతుంది. ఫలితంగా చిన్నచిన్న పనులకే అలసిపోకుండా ఉంటారు.