Cigarette with Tea | ‘టీ’ తాగుతూ ‘సిగరెట్’ కాలుస్తున్నారా..? వంధ్యత్వం తప్పదట.. జర జాగ్రత్త..!!
Cigarette with Tea | పనివేళల్లో, అలసిపోయినప్పుడు లేదా స్నేహితులు కలిసినప్పుడు చాలా మంది టీ( Tea ) తాగుతుంటారు. అయితే ఈ టీ సేవించడంతో పాటు సిగరెట్( Cigarette )ను కాలుస్తుంటారు. ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం కారణంగా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు.
Cigarette with Tea | పనివేళల్లో, అలసిపోయినప్పుడు లేదా స్నేహితులు కలిసినప్పుడు చాలా మంది టీ( Tea ) తాగుతుంటారు. అయితే ఈ టీ సేవించడంతో పాటు సిగరెట్( Cigarette )ను కాలుస్తుంటారు. ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం కారణంగా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు ఏర్పడుతాయని, గుండెపోటుకు కూడా గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ బారిన కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వేడి టీని తాగడం వల్ల జీర్ణ కణాలను దెబ్బతీంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, సిగరెట్ కలిసి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇది అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ లాంటి ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిగరెట్ లేదా బీడీలలో నికోటిన్ ఉంటుందని.. టీ, సిగరెట్ రెండూ రక్తపోటును పెంచుతాయని నిపుణలు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు.
టీ, సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గుండెపోటు ప్రమాదం
అన్నవాహిక క్యాన్సర్
గొంతు క్యాన్సర్
నపుంసకత్వము, వంధ్యత్వం యొక్క ప్రమాదం
కడుపు పూత
చేతులు, కాళ్ల పూత
జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదం
తక్కువ ఆయుర్దాయం
ఊపిరితిత్తుల క్యాన్సర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram