Pressure cooker | ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదా..?
Pressure cooker : మన దేశంలో వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్‌లో వంట చేస్తున్నారు. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు.

Pressure cooker : మన దేశంలో వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్‌లో వంట చేస్తున్నారు. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తోంది. దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు.
పైగా ప్రెషర్‌తో ఉడకడంవల్ల అన్నం రుచిగా ఉంటుందని చెబుతున్నారు. కుక్కర్‌లో వండిన అన్నంలో పిండిపదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫ్యాట్ కంటెంట్ తగ్గడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్‌లో అన్నంతో ప్రయోజనమే తప్ప నష్టం లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
- ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్న సరిగ్గా ఉడకడంవల్ల సులువుగా జీర్ణమవుతుంది.
- పైగా అన్నంలో ప్రోటీన్‌లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి.
- ఎక్కువ ప్రెషర్‌లో అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి.
- పొయ్యి మీది వంటతో పోల్చితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వేగంగా సిద్ధమవుతుంది.
- పొయ్యి మీది మాదిరిగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం ఎగరకపోవడం వల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.