Pregnancy Problems | అమ్మాయిలు సరిగా నిద్రించడం లేదా..? పెళ్లాయ్యక ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనట..! జర జాగ్రత్త..!!
Pregnancy Problems | అమ్మాయిలు( Girls ) ఏదో ఒక రోజు పెళ్లి( Marriage ) చేసుకోక తప్పదు. ఆ తర్వాత పిల్లలను కనక తప్పదు. అయితే పెళ్లి కంటే ముందు సరిగా నిద్రించని( Sleeping ) అమ్మాయిల్లో పెళ్లాయ్యక ప్రెగ్నెన్సీ సమస్యలు( Pregnancy Problems ) ఏర్పడి అమ్మ తనానికి దూరమవుతున్నారట.
Pregnancy Problems | ప్రతి మనిషికి.. అంటే ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నిద్ర( Sleeping ) అవసరం. కంటి నిండా నిద్రించిన వారికి ప్రస్తుతం కానీ, భవిష్యత్‌లో కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు( Health Issues ) సంభవించవు. సాధ్యమైనంత వరకు అలాంటి వారు హెల్తీగా ఉంటారు. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలు కంటి నిండా నిద్ర( Sleeping ) పోవాలట. అంటే రోజుకు 6 నుంచి 7 గంటల పాటు అమ్మాయిలు( Girls ) నిద్రించాలట. ఒక వేళ ఇలా నిద్రించకపోతే భవిష్యత్‌లో పెళ్లాయ్యక ప్రెగ్నెన్సీ( Pregnancy ) రావడం కష్టమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటున్నారట..!
ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు రాత్రి సమయాల్లో ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు కునుకు తీస్తున్నారు. జాబ్‌ల రీత్యా, వివిధ కారణాల వల్ల మళ్లీ పొద్దున్నే మేల్కొని సరిగా నిద్ర పోవడం లేదు. రీసెంట్గా చేసిన ఓ స్టడీలో 61 శాతం ఇండియన్స్‌లో రాత్రి నిద్ర తక్కువగా ఉన్నట్లు తేలింది. దాదాపు 61 శాతం మంది ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు గుర్తించారు. అయితే వీరిలో మగవారి కంటే ఆడవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలా లేట్ నైట్ పడుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు.. భవిష్యత్‌లో అమ్మతనానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆడవారిలో ప్రెగ్నెన్సీ సమస్యలు..!
సరైన సమయం నిద్రించకపోవడం కారణంగా ఆడవారిలో ఇన్ఫెర్టిలిటీ( Infertility ) సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరు తల్లి అనే పదానికి దూరమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో పీరియడ్స్ సమస్యలు తలెత్తి.. ఇరెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయట. ఇర్రెగ్యూలర్ పీరియడ్స్, బ్లడ్ డిశ్చార్జ్ ఎక్కువ లేదా తక్కువ కావడం వంటి సమస్యలు పెరుగుతాయట. ప్రధానంగా ఇవి పీసీఓఎస్(PCOS ), పీసీఓడి( PCOD ) వంటి సమస్యలకు దారితీసి.. క్రమంగా ప్రెగ్నెన్సీ సమస్యలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సరిగా నిద్రించకపోవడానికి అసలు కారణాలు ఇవే..
రాత్రుళ్లు అమ్మాయిల్లో నిద్రలేకపోవడానికి అత్యంత ప్రధానకారణాలు ఇవేనంటూ కొన్ని విషయాలు తెలిపారు. అధిక ఒత్తిడి, యాంగ్జైటీకి గురికావడం ఒక రీజన్ అయితే.. పని భారం ఎక్కువ అవ్వడం మరోసమస్యగా చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల చాలామంది అమ్మాయిలు తమ నిద్రకు దూరమవుతున్నారని తెలిపారు నిపుణులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram