Meditation | మెడిటేషన్‌తో మైండ్ రిలాక్స్ అవ్వడమే కాదు.. బరువు కూడా తగ్గొచ్చట..!
Meditation | బరువు తగ్గేందుకు వాకింగ్( Walking ), ఇతర వర్కవుట్స్ చేయాల్సిన పని లేదని నిపుణులు అంటున్నారు. మైండ్ రిలాక్స్( Mind Relax ) కోసం చేసే మెడిటేషన్( Meditation )తో కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Meditation | ఇటీవలి కాలంలో చాలా మంది బిజీ లైఫ్( Busy Life ) గడుపుతున్నారు. కనీసం నాలుగు అడుగులు వేద్దామంటే కూడా సమయం దొరకని పరిస్థితి. దీంతో చాలా మంది బరువు( Weight ) పెరిగిపోతున్నారు. పెరిగిన బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు( Health Issues ) చుట్టుముడుతున్నాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు రోగాలకు దూరంగా ఉన్నట్టే. మరి బరువు తగ్గేందుకు వాకింగ్( Walking ), ఇతర వర్కవుట్స్ చేయాల్సిన పని లేదని నిపుణులు అంటున్నారు. మైండ్ రిలాక్స్( Mind Relax ) కోసం చేసే మెడిటేషన్( Meditation )తో కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలు ఫాలో అయితే బరువు తగ్గడం సులభమని పేర్కొంటున్నారు.
బరువు తగ్గేందుకు మెడిటేషన్ చిట్కాలు ఇవే..
ఇంట్లో లేదా పార్కు( Park )లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. కంఫర్ట్బుల్ పొజిషన్లో కూర్చోవాలి. మీ నడుమును వంచేయకుండా స్ట్రైయిట్‌గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరంపై ఒత్తిడి( Stress ) పెరగదు. ఈ పొజిషన్లో ఉన్న తర్వాత.. ముక్కు ద్వారా.. స్లోగా డీప్ బ్రీత్లు తీసుకోవాలి. ఇప్పుడు స్లోగా నోటి ద్వారా బ్రీత్( Breathing )ని వదలాలి. శ్వాసపై ధ్యాస ఉంచాలి. బ్రీత్ మీ శరీరంలోకి ఎలా వెళ్తుంది. శరీరం బయటకి ఎలా వెళ్తుందనే దానిపై ఫోకస్ చేయాలి. ఏమైనా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంటే.. వాటిపైకి దృష్టి వెళ్లకుండా.. బ్రీత్పై ఫోకస్ చేస్తూ ఉండాలి. మీకు నచ్చిన ప్రదేశాన్ని.. నచ్చిన సన్నివేశాన్ని.. అందమైన ఫారెస్ట్, లేదా బీచ్‌ని దృష్టికి తెచ్చుకోవాలి. అక్కడ మీరు ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు. అయితే రోజుకు 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
ఒత్తిడి కూడా బరువు పెరిగేందుకు కారణమే..!
శరీరంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. అవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని పెంచుతాయి. ఇవి బెల్లీ ఫ్యాట్‌ని పెరిగేలా చేస్తాయి. దీనివల్ల బరువు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అయితే మెడిటేషన్‌తో ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడి ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోకుండా ఎంత కష్టపడినా.. బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. మెడిటేషన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. పైగా స్ట్రెస్ ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇవి కూడా బరువు పెరిగేలా చేస్తాయి. మేడిటేషన్ అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని దూరం చేస్తుంది.
మెడిటేషన్‌తో మెరుగైన నిద్ర..
సరైన నిద్ర లేకుంటే బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం బరువే కాకుండా ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిన వాళ్లు రోజూ మెడిటేషన్ చేస్తే.. మెరుగైన నిద్ర వారి సొంతమవుతుంది. దీనివల్ల బరువు పెరగరు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిద్రలో బాడీ రీసెట్ అయ్యి.. మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. మెడిటేషన్‌తో ఒత్తిడి, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది కాబట్టి మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.