New COVID-19 Cases । కొత్తగా 300 కొవిడ్ కేసులు.. 97 రోజుల తర్వాత ఇదే అత్యధికం
దేశంలో గడిచిన 24 గంటల్లో 300కుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 97 రోజుల తర్వాత ఇదే అత్యధికంగా కావడం గమనార్హం. విధాత : దేశంలో 300కుపైగా కొవిడ్ కేసులు (Covid-19) నమోదయ్యాయి. 97 రోజుల తర్వాత ఇదే అత్యధికం. తాజా కేసులను కలుపుకొంటే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,686కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో 334 తాజా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో […]

దేశంలో గడిచిన 24 గంటల్లో 300కుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 97 రోజుల తర్వాత ఇదే అత్యధికంగా కావడం గమనార్హం.
విధాత : దేశంలో 300కుపైగా కొవిడ్ కేసులు (Covid-19) నమోదయ్యాయి. 97 రోజుల తర్వాత ఇదే అత్యధికం. తాజా కేసులను కలుపుకొంటే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,686కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొన్నది.
గడిచిన 24 గంటల్లో 334 తాజా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరి చనిపోవడంతో మరణాల సంఖ్య 5,30,775గా నమోదైంది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,46,87,496 గా ఉన్నది. వీరిలో 4,41,54,035 మంది కోలుకోగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి.