Snacks for diabetics | ఎండాకాలంలో షుగర్ పేషెంట్‌లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?
Snacks for diabetics : ఇప్పుడు షుగర్ సర్వసాధరమైన వ్యాధిగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారినపడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం.
Snacks for diabetics : ఇప్పుడు షుగర్ సర్వసాధరమైన వ్యాధిగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారినపడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం. ఆహారం విషయంలోనూ తినాల్సినవి, తినకూడనివి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..
ఫుడ్స్ ఫర్ డయాబెటిక్స్..
- డయాబెటిస్ పేషెంట్లు వేసవిలో సులువుగా జీర్ణమయ్యే స్నాక్స్ తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలతో పెరుగును కలిపి సలాడ్ చేసుకొని తినడంవల్ల తేలికగా జీర్ణమవుతుంది. ఎందుకంటే మొలకెత్తిన గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
- దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకోవడంవల్ల వేసవిలో వేడిగా ఉన్న శరీరం చల్లబడుతుంది. అలాగే దాహం కూడా తీరుతుంది. ఎందుకంటే దోసలో అధిక శాతం నీరే ఉంటుంది. అంతేగాక పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి.
- పెసరపప్పు కూడా షుగర్ పేషెంట్లకు వేసవిలో మంచి ఆహారం. ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్‌లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. అందుకే పెసరపప్పు తినడంవల్ల డయాబెటిస్‌తోపాటు కడుపులో మంట కూడా తగ్గుతుంది. పెసరపప్పుతో పెరుగును కలుపుకుని పలు వెరైటీల్లో స్నాక్స్ చేసుకుని తినొచ్చు.
- ఈ స్నాక్స్‌తోపాటు నిమ్మరసం, సల్ల, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తరచూ తీసుకుంటే శరీరంగా కూల్ ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలో హెచ్చతగ్గులకు లోనుకాకుండా అదుపులో ఉంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram