Health tips | ఈ ఫుడ్స్‌ మీ లంగ్స్‌ను క్లీన్‌ చేస్తాయి.. వీటిని తప్పక తినండి..!

Health tips : జీవికి శ్వాసతోనే శక్తి అందుతుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలో ప్రధానపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఊపిరితిత్తులకు ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకవేళ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకితే ఏ ప్రాణి అయినా, మనిషైనా శక్తిహీనమవుతారు. తీవ్ర అలసట, ఆయాసంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలు మేలు చేస్తాయని, ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె (Honey)

కొన్ని రకాల ఆకు కూరలు, కూరగాయల మాదిరిగానే ఇంట్లో వినియోగించే మరికొన్ని ఆయుర్వేద పదార్ధాలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఆహార పదార్థాల్లో తేనె చాలా ముఖ్యమైనది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజు ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఒక స్పూన్ తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.

పసుపు (Turmeric)

పసుపు కూడా ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునేందుకు పచ్చి పసుపును వాడటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపు కొమ్మును నమిలి తిన్నా, లేదంటే పచ్చి పసుపును దంచి పాలల్లో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పచ్చి పసుపును వారానికి మూడునాలుగు సార్లు తినాలి. ఇది శ్వాసకోశ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి సహజంగా పనిచేసే నివారిణి. పసుపు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

అల్లం (Ginger)

అదేవిధంగా ఊపిరితిత్తుల శుభ్రత కోసం ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అల్లం టీ తాగినా, ఏదైనా సలాడ్‌లలో అల్లాన్ని ఉపయోగించినా, మరేరకంగా అయినా నిత్యం అల్లం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడేవారు, ఇన్‌ఫెక్షన్లతో సతమతమయ్యేవారు ఈ నేచురల్ పదార్థాలను వినియోగించి ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు.