Vitamin B12 | విటమిన్ B12 లభించే అద్భుతమైన ఆహార పదార్థాలివే..!
Vitamin B12 Foods | విటమిన్ బీ12 శరీరానికి మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉంటే మెదడు, నాడీ వ్యవస్థ రెండూ దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెదడు, నాడీ వ్యవస్థను ఆరోగ్య ఉంచుకునేందుకు విటమిన్ B12 తప్పనిసరి. శరీరంలో ఎర్ర రక్త కణాలు సైతం ఈ విటమిన్‌తోనే అభివృద్ధి చెందుతాయి. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే ఎముకల ఆరోగ్యంపై సైతం ప్రభావం చూపుతుంది. అలాగే రక్తహీనత సమస్య […]

Vitamin B12 Foods | విటమిన్ బీ12 శరీరానికి మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉంటే మెదడు, నాడీ వ్యవస్థ రెండూ దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెదడు, నాడీ వ్యవస్థను ఆరోగ్య ఉంచుకునేందుకు విటమిన్ B12 తప్పనిసరి. శరీరంలో ఎర్ర రక్త కణాలు సైతం ఈ విటమిన్‌తోనే అభివృద్ధి చెందుతాయి. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే ఎముకల ఆరోగ్యంపై సైతం ప్రభావం చూపుతుంది. అలాగే రక్తహీనత సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే, మెడిసిన్ వాడకుండా కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా సహజంగా విటమిన్ లోపం నుంచి బయటపడచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి..!
ఓట్స్, సోయాబీన్స్‌తో..
ప్రస్తుతం చాలామంది ఓట్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. విటమిన్ B12 లోపాన్ని వీటితో అరికట్టవచ్చు. దీంతో పాటు ఆహారంలో సోయాబీన్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
క్యాస్రోల్స్, కూరగాయలు, శాండ్‌విచ్‌ల్లో కలిపి తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. అలాగే రోటీలు చేసే సమయంలో పిండిలో సోయాబిన్ పిండిని జోడిస్తే ప్రయోజనకంగా ఉంటుంది. సోయా పాలల్లో B12 ఎక్కువ మోతాదులో ఉంటుంది.
పుట్టగొడుగులు, బ్రోకలీ తీసుకోండి..
విటమిన్ల లోపాన్ని నివారించేందుకు పుట్టగొడుగులు తీసుకోవాలి. వీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, ప్రోటీన్, ఐరన్‌కూడా శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ శరీరానికి పోషణను అందిస్తుంది. అలాగే బ్రోకలీని సైతం తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీంతో విటమిన్ బీ12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని సైతం అరికడుతుంది.
పాల ఉత్పత్తులను ఉపయోగించండి..
పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు కూడా విటమిన్ B12 లోపాన్ని పరిష్కరిస్తాయి. పాలల్లో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ బీ12 ఉంటాయి. తక్కువ కొవ్వు పెరుగు తింటే, విటమిన్ B12 లోపం నుంచి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది.