Viral Video | ఈ వీడియో చూస్తే జన్మలో నూడుల్స్‌ తినరు!

అయితే.. ఇది నిజంగా నూడుల్స్‌ను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ రికార్డ్‌ చేసిందేనా? అన్నదాంట్లో సందేహాలు ఉన్నాయి. ఈ వీడియో తీసిన తీరు గమనిస్తే అనేక లోపాలు ఉన్నాయని ఒక కమ్యూనిటీ ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది.

Viral Video | ఈ వీడియో చూస్తే జన్మలో నూడుల్స్‌ తినరు!

Viral Video | నూడుల్స్‌ అంటే ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటాం. ఇంట్లో టిఫిన్‌కు ఏమీ లేకపోతే.. వెంటనే దృష్టిపడేది ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ పైనే. ఎందుకంటే చేయడం సులభం.. రుచికి రుచి! కానీ.. ఈ వీడియో నిజమో కాదో కానీ.. చూస్తే మాత్రం జీవితంలో నూడుల్స్‌ తినకూడదు అనిపిస్తుంది. ఆహార పదార్థాలకు సంబంధించిన కొన్ని వీడియోలు వెగటు పుట్టిస్తాయి. ప్రత్యేకించి ఆహార పదార్థాల్లో కంటికి కనిపించని బ్యాక్టీరియాను మైక్రోస్కోప్‌లో చూపించే వీడియోలు.. భయం కలిగిస్తుంటాయి. ఇలాంటిదే ఒక వీడియో కొంతకాలంగా వైరల్‌ అవుతున్నది. ఈ వీడియో నూడుల్స్‌ ప్యాకేజికి సంబంధించినది. నూడుల్స్‌ను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తే ఏమేం కనిపిస్తాయనే ప్రయోగంతో ఈ వీడియో చేసినట్టు కనిపిస్తున్నది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఆహార నాణ్యతపై సందేహాలను ఈ వీడియో లేవనెత్తుతున్నది.

అయితే.. ఇది నిజంగా నూడుల్స్‌ను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ రికార్డ్‌ చేసిందేనా? అన్నదాంట్లో సందేహాలు ఉన్నాయి. ఈ వీడియో తీసిన తీరు గమనిస్తే అనేక లోపాలు ఉన్నాయని ఒక కమ్యూనిటీ ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది. పరీక్షించిన వ్యక్తి చేతికి డిస్పోజబుల్‌ లేటెక్స్‌ గ్లవ్స్‌ బదులు రీయూజబుల్‌ గ్లవ్స్‌ ఉండటం, ఎడిటింగ్‌లో అనేక కట్స్‌ ఉండటం వంటివాటిని అది ప్రస్తావించింది. ఇలా ఆహార పదార్థాల మీద చాలా డిజిటల్‌ కల్పిత వీడియోలు గతంలోనూ వచ్చాయని అంటున్నారు. ఇది డిజిటల్‌ కల్పితమనే విషయాన్ని పక్కనపెడితే.. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ను ప్యాక్‌ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోయినా, గాలి చొరబడే అవకాశం ఉన్నా.. అందులో కంటికి కనిపించని పురుగులు చేరే అవకాశం మాత్రం ఉందని నిపుణులు చెబుతున్నారు.