Banana | ప‌రిగ‌డుపున.. అర‌టి పండు తింటే ప్ర‌మాద‌మా?

Banana | సీజన్​తో సంబంధం లేకుండా ఏడాది మొత్తం అందుబాటులో ఉండే అరటి పండు( Banana ) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ధర తక్కువగా ఉండడం, రుచికరంగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల ఎక్కువ మంది తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

  • By: raj    health    Mar 18, 2025 9:16 AM IST
Banana | ప‌రిగ‌డుపున.. అర‌టి పండు తింటే ప్ర‌మాద‌మా?

Banana |

అర‌టి పండు( Banana ).. సీజ‌న్‌తో సంబంధం లేకుండా సంవ‌త్స‌రం మొత్తం మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. షుగ‌ర్ పేషెంట్లు( Sugar Patients ) మిన‌హాయిస్తే.. అంద‌రూ అర‌టి పండును తింటుంటారు. మిగ‌తా పండ్ల‌తో పోల్చితే అర‌టి పండ్ల ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది. అంద‌రికీ అందుబాటులో ఉండే అర‌టి పండ్ల వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మ‌రి అర‌టి పండును ఏ స‌మ‌యంలో తింటే బెట‌ర్ అనేది కూడా ముఖ్య‌మే. మ‌రి ఏ స‌మ‌యంలో తినాలి.. ఏ స‌మ‌యంలో తిన‌కూడ‌దో తెలుసుకుందాం.

చాలా మంది అర‌టి పండును ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకుంటుంటారు. జిమ్‌కు వెళ్లే వారు, వాకింగ్‌కు వెళ్లే వారు అర‌టి పండును తింటుంటారు. అయితే ఇందులో చాలా మంది ప‌రిగ‌డుపున అర‌టి పండును తినేస్తుంటారు. అలా చేయ‌డం మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ఉదయం ఇతర ఆహార పదార్థాలతో కలిపి అర‌టి పండును తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ పేర్కొంటున్నారు.

ఎందుకంటే.. అర‌టి పండు ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. దీంతో అర‌టి పండును ఖాళీ క‌డుపున తీసుకుంటే.. జీర్ణ‌క్రియ‌పై ఒత్తిడి క‌లిగి.. అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల ఎసిడిటీ స‌మ‌స్య కూడా ఉత్ప‌న్న‌మై.. పుల్ల‌టి డెపులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక రోజంతా.. జీర్ణ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ప‌ర‌గ‌డుపున అర‌టి పండు తీసుకోవ‌ద్దు.

రాత్రి పూట అర‌టి పండు తినొచ్చా..?

ఉద‌యం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి అర‌టి పండును తినొచ్చు అంటున్నారు. మ‌రి రాత్రిపూట అర‌టి పండు తినొచ్చా..? అంటే వ‌ద్ద‌నే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుందని.. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్‌ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడిస్తున్నారు. అలాగే రాత్రి తింటే శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుందని.. అందుకే దగ్గు ఉన్నవారు రాత్రి తీసుకోకూడదని చెబుతున్నారు. అరటిపండును ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటేనే ఎక్కువ లాభాల ఉంటాయని వివరిస్తున్నారు.

ఇక అర‌టి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్, ట్రిప్టోపాన్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడం, గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని తెలిపారు. ముఖ్యంగా బాగా పండిన అరటిపండులో స్టార్చ్ పూర్తిగా విరిగిపోయి తీపి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని శరీరానికి అందుతుందని వెల్లడిస్తున్నారు.