ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లుకు అనుమతించండి : స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి

ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వినతి. ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ నేతృత్వంలో నోటీసులు సమర్పించారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతిపాదించనున్న ప్రైవేటు మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం నోటీసులు అందించింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ఈ మేరకు నోటీసులు అందించి..ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసులు స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, మల్లారెడ్డి, కేపీ వివేకానందా, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, చింతా ప్రభాకర్‌, అనిల్ జాదవ్‌, మానిక్‌రావు, దాసోజ్‌ శ్రవణ్‌కుమార్‌ , శంభీపూర్‌ రాజు, మాదవరం కృష్ణారావు, కల్వకుంట్ల సంజయ్‌, కౌశిక్‌ రెడ్డి తదితరులున్నారు.

ఇవి కూడా చదవండి :

Moinabad Drug Case : మెయినాబాబ్ డ్రగ్ కేసులో ముగ్గురి కస్టడీకి అనుమతి
పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్‌కు సమస్యలు: ప్రధాని మోదీ

Latest News