మంత్రి పొంగులేటి టార్గెట్ గా మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ ఫైర్..మంత్రుల కౌంటర్
మైనింగ్ అక్రమాలపై మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి మంత్రులు కౌంటర్ ఇస్తూ అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగింది.
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో శనివారం మైనింగ్ అంశంపై జరిగిన చర్చ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా కొనసాగడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వ్యాగ్యుద్దం సాగింది. మైనింగ్ అనుమతులపై అధికార కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం రూల్స్ ఉంటాయా అని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. స్టోన్ క్రషర్ లో
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని.. ఆయనకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్పై అక్రమాలకు పాల్పడినందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోరని, ప్రతిపక్ష నేతలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే జైలులో పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
అధికార పక్షానికి ఒక రూల్.. ప్రతిపక్షానికి ఒక రూల్ ఏంటని నిలదీశారు. హరీష్ రావు లేవనెత్తిన ఈ డిమాండ్పై కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలను హరీష్ రావు వెనక్కి తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు. పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడికి రాత్రికి మైనింగ్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసులు పెట్టి, జరిమానాలు వేసి, రాత్రికి రాత్రే జైలుకు పంపించారని, అదే అధికార పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్చన్ స్టోన్ క్రషర్ల వల్ల మూసీ, గండిపేట కలుషితం అవుతున్నాయని మైనింగ్ అధికారులు తేల్చారని, కంచె చేను మేసినట్లుగా కాంగ్రెస్ మంత్రుల తీరు ఉందని, రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. నేను తప్పు మాట్లాడితే ఉరి వేయండి..సస్పెండ్ చేయండని లేదంటే మంత్రిపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.
జీవో 111 ఉల్లంఘన చేసి శంషాబాద్ కోత్వాల్‌గూడలో రాఘవ కన్ స్ట్రక్చన్ బరితెగించిందని, ఎలాంటి పర్మిషన్లు, లైసెన్సులు లేకుండా డీజిల్ జనరేటర్లతో దర్జాగా స్టోన్ క్రషర్ దందా నడిపిస్తుందని, అధికారులు రెండుసార్లు పట్టుకున్నా, నోటీసులు ఇచ్చినా రాఘవ కన్ స్ట్రక్షన్స్‌పై యాక్షన్ ఏదీ? అని నిలదీశారు. నిబంధనల ప్రకారం 25 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని హరీశ్ రావు సవాల్ చేశారు. ఇదే డిమాండ్ తో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు ధర్నాకు దిగారు. సభలో లేని మంత్రి పేరును ప్రస్తావించడంపై హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది.
మంత్రుల ఎదురుదాడి
మంత్రి పొంగులేటిపై హరీశ్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి, ఆడ్లూరి లక్ష్మణ్, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ లు ఎదురుదాడి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మైనింగ్ మంత్రి వివేక్ మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశిస్తామని చెప్పినా కూడా సభలో అల్లరి చేయడం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ శాఖలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చర్చలో స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం హరీశ్ కు లేదని, మంత్రి పొంగులేటి పేరు ఎలా ప్రస్తావిస్తారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని శ్రీధర్ బాబు చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లు మాట్లాడుతూ నేరెళ్ల ఇసుక మాఫియాతో రూ.1000కోట్ల ఇసుక దోచుకున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో హరీశ్ రావు మంత్రి పొంగులేటిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పద్దులపై మాట్లాడకుండా మంత్రి పొంగులేటిపై బురద చల్లేందుకు రాఘవ కన్ స్ట్రక్షన్ పేరుపై రచ్చ చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. పదేళ్లలో రక్షకులు భక్షకులైనందునే వారిని గద్దె దించారని ఎద్దేవా చేశారు. క్రీడా పోటీలకు రారుగాని.. డ్రగ్ పార్టీలకైతే పరుగు పెడుతారని విమర్శించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ మైనింగ్ రూల్స్ పాలసీలతో రాష్ట్ర మైనింగ్ ఆదాయం పెరిగిందని తెలిపారు. మైనర్ మిరనల్స్ గ్రోత్ 35శాతం పెరిగిందన్నారు. ఇసుక మైనింగ్ లో 700కోట్ల నుంచి 1000కోట్ల ఆదాయం సాధించామని తెలిపారు. రాఘవ కనస్ట్రక్షన్ సహా పలు క్రషర్లపై ఫెనాల్టీల ద్వారా 7.8కోట్లు వసూలు చేయడం జరిగిందని, ఏదేని కంపెనీలు మైనింగ్ ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. గత 10 ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం చెప్పాక కూడా రచ్చ ఎందుకని మంత్రి సీతక్క బీఆర్ఎస్ పక్షంపై మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
Peddi | పెద్ది లో డబుల్ స్పోర్ట్స్ ట్విస్ట్ …లగాన్ చిత్రంలో మాదిరిగానే క్రికెట్‌తో పాటు కుస్తీ కూడా!
Hyderabad Metro | ఇకపై సర్కారీ ‘మెట్రో’ రైల్.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram