• Telugu News
  • /Hyderabad

Hyderabad Metro | ఇకపై సర్కారీ ‘మెట్రో’ రైల్.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ స్వాధీనం చేసుకునే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. మెట్రో విస్తరణకు ఇది దోహదం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 28, 2026, 4:11 pm IST
Read Time: 3 mins
Hyderabad Metro | ఇకపై సర్కారీ ‘మెట్రో’ రైల్.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

విధాత, హైదరాబాద్ : హైదారాబాద్ మెట్రో రైల్ సంస్థ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మెట్రో ప్రభుత్వ స్వాధీనంకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మెట్రో స్వాధీనానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై తెలంగాణ అసెంబ్లీలో కొంత రచ్చ రేగింది. మెట్రో విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే స్వాధీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచి, మెట్రో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కావలసిన ప్రణాళికలను రచించామన్నారు. మెట్రో-1ని ఎల్ ఆండ్ టీ(L&T)సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అయితే మీరే బిల్లు పెట్టి..మీరే ఏకగ్రీవంగా ఎలా ఆమోదించుకుంటారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పబట్టారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని, ఏకపక్ష తీర్మానమని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకాకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా పాస్ చేస్తారని ప్రశ్నించారు. శాసనసభ నడిపే వ్యవహారం, పద్ధతి ఇది కాదన్నారు. దీనిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందిస్తూ…. సీఎం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డంకులు సృష్టించాలనేదే ప్రతిపక్షం పద్దతిగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

ఎల్పీజీ గుడ్ న్యూస్.. గుజరాత్‌ పోర్ట్‌కు చేరుకున్న జగ్ వసంత్ ట్యాంకర్
TG Assembly | అసెంబ్లీ నుంచి మరోసారి బీఆర్ఎస్ వాకౌట్