Peddi | పెద్ది లో డబుల్ స్పోర్ట్స్ ట్విస్ట్ …లగాన్ చిత్రంలో మాదిరిగానే క్రికెట్‌తో పాటు కుస్తీ కూడా!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
మొదట ఈ సినిమా పూర్తిగా క్రికెట్ నేపథ్యంతో ఉండబోతుందని అందరూ భావించారు. ఇందుకు బలం చేకూర్చుతూ రామ్ చరణ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌తో కథపై ఉన్న అంచనాలు పూర్తిగా మారిపోయాయి.
కుస్తీ రంగంలోకి దిగిన చెర్రీ
‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌లో రామ్ చరణ్ కుస్తీ యోధుడిగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇసుక మైదానంలో కుస్తీ పట్లుతో పోరాడుతూ గురువును మెప్పించే ప్రయత్నం చేస్తున్న పాత్రలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఆకట్టుకుంది.
“కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదు… ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట” అనే డైలాగ్ ఈ సినిమాలోని భావోద్వేగాన్ని హైలైట్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే, కథలో క్రికెట్ నుంచి కుస్తీ వైపు మలుపు తిరిగే ప్రయాణం ప్రధానంగా ఉండబోతుందని అర్థమవుతోంది.
రెండు ఆటలతో కొత్త ప్రయోగం
ఒకే సినిమాలో క్రికెట్, కుస్తీ అనే రెండు విభిన్న క్రీడలను కలిపి చూపించడం టాలీవుడ్‌లో అరుదైన ప్రయోగం. గతంలో లగాన్ క్రికెట్ నేపథ్యంలో దంగల్ కుస్తీ నేపథ్యంలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ రెండు స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను కలిపి చూపిస్తూ ‘పెద్ది’లో బుచ్చిబాబు కొత్త కథను ప్రేక్షకులకు అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అంచనాలు పెంచుతున్న ప్రమోషన్స్
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా వచ్చిన గ్లింప్స్‌తో ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ డ్రామా కాకుండా భావోద్వేగాలతో కూడిన ప్రయాణంగా ఉండబోతుందని క్లారిటీ వచ్చింది. ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి, క్రికెట్‌తో ప్రారంభమై కుస్తీతో మలుపు తిరిగే కథ, రామ్ చరణ్ కొత్త అవతారం, బుచ్చిబాబు డిఫరెంట్ టేకింగ్ అన్నీ కలిసి ‘పెద్ది’ను ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram