వాట్సాప్ కాల్స్ రికార్డు అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది అని తేల్చి చెప్పారు. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ గతంలో కూడా పలుమార్లు ఫేక్ ప్రచారం చోటుచేసుకుందని, అప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేశాం అని గుర్తు చేశారు.
అయినా కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను షేర్ చేస్తున్నారన్నారు. బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి అని, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం అని సజ్జనార్ హెచ్చరించారు.
