CP VC Sajjanar Fake Facebook Account : హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా!
హైదరాబాద్ నగర సీపీ వీ.సీ. సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారు. ఆపదలో ఉన్నానని మెసేజ్‌లు పంపడంతో, ఇప్పటికే ఒక స్నేహితుడు రూ.20 వేలు పోగొట్టుకున్నారని సీపీ వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : నేరాలకు చెక్ పెట్టే పోలీసు అధికారుల పేరుతోనే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి సవాల్ విసరుతున్నారు సైబర్ నేరగాళ్లు. తను ఏ శాఖ భాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికి..నిత్యం ఆన్ లైన్, సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసే ఐపీఎస్ అధికారి, ప్రస్తుత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించిన సైబర్ నేరగాళ్లు డబ్బుల వసూళ్లకు ప్లాన్ చేశారు. నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20 వేలు పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram