హైదరాబాద్ లో సూర్య ప్రతాపం !
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. తెలంగాణ జిల్లాల్లోనూ ఎండలు మండిపోతుండగా పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
విధాత, హైదరాబాద్ : వేసవి ఎండల తీవ్రత హైదరాబాద్ నగర వాసులతో తెలంగాణ ప్రజలను వణికిస్తుంది. హీట్‌వేవ్ కారణంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం రోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటివేశాయి. ఆర్సీ పురంలో 42.3°C, ఆసిఫ్‌నగర్ 42, హిమాయత్‌నగర్ 42, మమలక్‌పేట 41.9, బేగంపేట్ 41.9, సరూర్‌నగర్ 41.8, చాంద్రాయణగుట్ట 41.8, గోషామహల్ 41.8, మియాపూర్ 41.8, మూసాపేట్ 41.7, జూబ్లీ హిల్స్ 41.7, సంతోష్ నగర్ 41.6, ఉప్పల్ లో41.5 నమోదయ్యాయి.
కూకట్‌పల్లిలో 41.5, హయత్‌నగర్ 41.5, లింగంపల్లి 41.4, కుత్బుల్లాపూర్ 41.3, మల్కాజిగిరి 41.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిల్లాలలోనూ దంచికొడుతున్న ఎండలు
జగిత్యాలలో 44.4°C, ఆదిలాబాద్ 44.3, కెబి ఆసిఫాబాద్ 44.3, మంచిరియల్ 44.3, నల్గొండ 44.3, నిర్మల్ 44.3, నిజామాబాద్ 44.3, కామారెడ్డి 44.1, కరీంనగర్ 44.1, సిద్దిపేట 44.1, మెదక్ 43.8, సిరిసిల్ల 43.8, పెద్దపల్లి 43.6, ములుగు 43.5, నాగర్ కర్నూల్ 43.5, గద్వాల్ 43.1, రంగారెడ్డి 43.1, నారాయణపేట 43డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పీక్ హీట్‌వేవ్ కారణంగా మరో రెండు రోజుల్లో ఎండలు మరింత ఠారెత్తించనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తదుపరి 2-3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి :
తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram