Telugu states weather| తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు !

Telugu states weather| తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు !

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల(Telugu states weather_కు మరోసారి భారీ వర్షాల సూచన కలవర పెడుతుంది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ(IMD weather forecast)తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా తీరం(Odisha coast depression) దాటనుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఏపీAndhra Pradesh heavy rain)లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణ(Telangana rainfall alert)లోని ఈశాన్య తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్ ఉండబోతుందని..గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.