Sen Yar Cyclone| తెలుగు రాష్ట్రాలకు మరో తుపాన్.. పేరు సెన్ యార్!
తెలుగు రాష్ట్రాలకు మరో తుపాన్ ముప్పు ఎదురుకానుంది. ఇప్పటికే మొంథా తుపాన్ దెబ్బతో నష్టపోయిన రెండు రాష్ట్రాలు సెన్ యార్ పేరుతో రానున్న మరో తుపాన్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలవరపెడుతుంది.
విధాత : తెలుగు రాష్ట్రాలTelugu States)కు మరో తుపాన్ ముప్పు ఎదురుకానుంది. ఇప్పటికే మొంథా తుపాన్ దెబ్బతో నష్టపోయిన రెండు రాష్ట్రాలు సెన్ యార్(Sen Yar Cyclone) పేరుతో రానున్న మరో తుపాన్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలవరపెడుతుంది. ఈ తుపాన్ కు సెన్ యార్ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండగా బలపడనుంది. అల్పపీడనం ఈనెల 26 నాటికి తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ(IMD Weather Alert) వెల్లడించింది.
తుపాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram