తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,370 తగ్గి రూ. 1,54,200వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,250 తగ్గి రూ. 1,41,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,75,000 స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 17, 2026, 12:27 pm IST
Read Time: 4 mins
తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,370 తగ్గి రూ. 1,54,200వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,250 తగ్గి రూ. 1,41,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,75,000 స్థిరంగా కొనసాగుతుంది.

కొనసాగుతున్న ధరల ఊగిసలాట!

అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. బౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం బంగారం ధరలలో అనిశ్చితి కొనసాగుతుందంటున్నారు నిపుణులు. బంగారం ధరలు ఇటీవల బాగా పెరగడంతో, చాలామంది ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు గరిష్ట స్థాయికి చేరిన ప్రతిసారీ విక్రయాలు పెరగడం వల్ల ధర మరింత పైకి వెళ్లకుండా అడ్డుకట్ట పడుతోంది. కోమెక్స్ గోల్డ్ ప్రస్తుతం 4,800 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. అక్కడ 4,850 డాలర్ల వద్ద ఒక బలమైన రెసిస్టెన్స్ ఉండటంతో ధరలు అంతకు మించి పెరగడం కష్టంగా మారుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధర రూ. 1,52,500 నుండి రూ. 1,56,000 మధ్య ఊగిసలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వేచి చూడటమే మేలు ?

డాలర్ విలువలో మార్పులు , ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబించడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణంలో ధరలు బాగా పెరిగినప్పుడు వెంటపడి కొనుగోలు చేయడం కంటే, మార్కెట్ కొంత మేర తగ్గినప్పుడు పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే పసిడిలో మరో బలమైన ర్యాలీ వచ్చే అవకాశం ఉందని డీబీఎస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్ గమనాన్ని గమనిస్తూ ఓపికగా ఉండటమే ఇన్వెస్టర్లకు అత్యంత లాభదాయకమైన వ్యూహంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

LIC HFL Notification | డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?