ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..మెట్రో సర్వీసులు పెంపు

ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రోలో రద్దీ పెరగడంతో సర్వీసులు పెంచారు. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో తరచుగా రైళ్లు నడుస్తాయి.

విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె కాలంలో రోజుకు 56 మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాల 20 సెకన్లకు ఒక మెట్రో రైలు నడుపనున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంచుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకు మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.

మియాపూర్ – ఎల్బీ నగర్ కారిడార్ : సాధారణంగా పీక్ అవర్స్‌లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్‌లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు నడుస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు నడువనుంది.

నాగోల్ – రాయదుర్గ్ కారిడార్ : సాధారణంగా నాన్-పీక్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు నడుస్తుంది. సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్‌లో 44 రైళ్లకు తగ్గించేవారు. సమ్మె కారణంగా ఇప్పుడు ఆ తగ్గింపు ఉండదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ పరిశీలిస్తోందని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!

Latest News