ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. యాదగిరిగుట్ట నుంచి తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతులు ప్రమాదం శంషాబాద్ వద్ద జరిగింది. మృతులు రాజన్న సిరిసిల్ల కు చెందిన వారు.. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఓ ఆర్ ఆర్ 16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వీరంతా యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మరో స్కైలాబ్‌? భూమిపై పడిపోనున్న స్పేస్‌ టెలిస్కోప్‌.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం
అమెరికా నుంచి భారత్‌కు 657 ప్రాచీన వస్తువుల అప్పగింత

Latest News