కోకాపేట కొత్త చెరువులో 22 ఎకరాల మేర కబ్జాలను హైడ్రా మంగళవారం నిర్వహించిన భారీ ఆపరేషన్ తో తొలగించింది. ఖైతలాపూర్‌లోని రహదారిని ఆక్రమించి నిర్మించిన షెడ్డుల తొలగించింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం,కోకాపేట విలేజ్‌లోని కొత్త చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 1.20 ఎకరాల వరకూ ఆక్రమించి గోల్డ్ ఫిష్ విల్లాస్ కోసం ప్లే ఏరియాలు, పార్కుల నిర్మాణం చేపట్టారు. చెరువులో మరో 20 ఎకరాల మేర పలు నిర్మాణ సంస్థల ఆక్రమణలు పాల్పడ్డాయి.
ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెరువును కబ్జా చేశారు. చెరువును కాపాడాలంటూ హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో హైడ్రా. సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించింది. కోకాపేట కొత్త చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి మొత్తం 72 ఎకరాలు కాగా.. ఇందులో 22 ఎకరాల వరకూ ఆక్రమణలు జరిగినట్టు హైడ్రా తేల్చింది. ఆక్రమణలను నిర్ధారించుకున్నాక మంగళవారం రంగంలోకి దిగింది.
చెరువు ఎప్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఫెన్సింగ్‌లతో పాటు.. రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీలను తొలగించారు. చెరువు హద్దులు నిర్ధారించి హైడ్రా ఫెన్సింగ్ చేపట్టింది. కూకట్‌పల్లి మండలం ఖైతలాపూర్‌లో రహదారి ఆక్రమణలను తొలగించింది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు 1700ల గజాల మేర రహదారి ఆక్రమణలను సైతం తొలగించింది. నిర్మాణ సంస్థకు చెందిన ఆఫీస్ రూంతో పాటు.. తగిన సమయం ఇచ్చి వెనుక వైపు నిర్మించిన పశువుల షెడ్డును కూడా హైడ్రా తొలగించింది.
ఇవి కూడా చదవండి :
ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం మార్పు లొల్లి !
Bandla Ganesh | షాద్‌నగర్‌లో బండ్ల గణేష్ డ్రీమ్ హౌస్.. రూ.100 కోట్లకి పైమాటేనంటూ ఇండస్ట్రీలో చర్చ!
