Jubilee Hills | జూబ్లీహిల్స్‌లో దొరికిన నగదు ఎవరిది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తనిఖీల్లో మైత్రీవనం వద్ద ₹25 లక్షల నగదు పట్టుబడింది. విశాఖకు చెందిన శ్రీ జైరాం తలాసియా కారులో నగదు స్వాధీనం. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద విచారణ.

Jubilee Hills | జూబ్లీహిల్స్‌లో దొరికిన నగదు ఎవరిది?

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో పట్టుబడిన నగదు రూ.25లక్షలు ఎవరిదన్న ప్రశ్న సర్వత్రా ఆసక్తికరంగా మారింరది. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌ మైత్రీవనం ఎక్స్‌రోడ్స్, సారథి స్టూడియో సమీపంలో జరిపిన వాహన తనిఖీల సమయంలో అక్రమంగా తీసుకెళ్తున్న రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల సమయంలో టీఎస్ 09పీఎఫ్ 6111 నంబర్ గల కారులో ఈ నగదు దొరికింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీ జైరాం తలాసియాగా గుర్తించారు.

జైరాం తలాసియా ఈ నగదును తన కారులో యూసుఫ్‌గూడ వైపు తీసుకెళ్తున్న సమయంలో ఎస్ఎస్ టీ బృందం తనిఖీల్లో నగదు పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న నగదును మధురానగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం కోడ్‌ ఉల్లంఘన కిందకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. నిందితుడు తరలిస్తున్న 25లక్షలు ఎక్కడివి..ఈ డబ్బులను ఎవరికి ఇవ్వబోతున్నారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ నగదుకు, ఎన్నికల రాజకీయాలకు సంబంధం ఉందా లేక వ్యాపార సంబంధ నగదునా అన్న విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎస్ఎస్ టీ బృందం సమర్పించనుంది.