విధాత, హైదరాబాద్ : మెయినాబాద్ డ్రగ్ కేసులో నిందితులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మకు కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. పోలీసులు వేసిన కస్డడీ పిటిషన్ పై సోమవారం తీర్పు వెలువరించిన కోర్టు..ముగ్గురి నిందితు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారిస్తే డ్రగ్ కేసులో మరికొందరి పేర్లు తెర మీదకు రావచ్చని సిట్ భావిస్తుంది.
మరోవైపు మెయినాబాద్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు విచారిస్తున్న సిట్ బృందం దర్యాప్తులో కీలక పురోగతితో దూసుకపోతుంది. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడని, ఫాం హౌస్‌లో 24 సార్లు పార్టీలు జరిగినట్టు విచారణలో గుర్తించింది. ఆయా పార్టీలలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖలు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఎవరెవరూ ఆ పార్టీలకు హాజరయ్యారన్న సమాచారం గుర్తించేందుకు ఫామ్ హౌస్ సహా చుట్టుపక్కల అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సిట్ సేకరించి పరిశీలిస్తుంది. మరోవైపు డ్రగ్ పార్టీ సందర్బంగా పోలీసులపై కాల్పులు జరిపిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను షార్ప్ షూటర్‌గా దర్యాప్తు బృందం గుర్తించింది. అతడికి ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ మాఫియాతో సంబంధం ఉన్నట్లు సిట్ అనుమానిస్తూ విచారణ బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించింది.
ఇవి కూడా చదవండి :
పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్‌కు సమస్యలు: ప్రధాని మోదీ
ఆరు నూరైనా ఆయన ఈ రోజు కోర్టులో హాజరుకావాల్సిందే: హైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు
