కంచ గచ్చిబౌలి భూములపై హక్కు మాదే…సుప్రీంకోర్టులో నిజాం వారసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దూమారం లేపిన కంచ గచ్చిబౌలి భూములపై మరో వివాదం తెర పైకి వచ్చింది. ఈ భూములపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని వారు చెబుతున్నారు.