Fire Accident : పెట్రోల్ బంక్ లోకి మంటలతో వ్యాన్..తప్పిన భారీ ప్రమాదం
మంటలతో పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్! ఘట్‌కేసర్ అన్నోజీగూడ వద్ద బంక్ సిబ్బంది సాహసంతో పెను ప్రమాదం తప్పింది. సీఎన్జీ సిలిండర్ పేలకుండా మంటలార్పిన సిబ్బంది.
విధాత, హైదరాబాద్ : సీఎన్జీ సిలిండర్ తో కూడిన ఓమ్నీ వ్యాన్ లో మంటలు చెలరేగిన క్రమంలో వ్యాన్ పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. అదృష్టవశాత్తు పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో సాహసం చేసి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్నీ వ్యాన్ అన్నోజీ గూడ వద్దకు చేరుకున్న సందర్బంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపేయడంతో భయంతో అందులోని ప్రయాణికులు అంతా దిగి పారిపోయారు. డ్రైవర్ కూడా దిగిపోవడంతో అది నెమ్మదిగా రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది.
మంటలతో పెట్రోల్ బంక్ లోకి దూసుకొచ్చిన వ్యాన్ ను చూసిన బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడే ఉన్న అగ్నిమాపక పరికరాల సహాయంతో సాహసం చేసి సకాలంలో మంటలను అర్పేశారు. అది పూర్తిగా పేలిపోకుండా చేయగలిగారు. మంటలు బంక్ లోకి పెట్రోల్, డీజీల్ పంప్ లకు అంటుకున్నా…వ్యాన్ పేలినా పెను ప్రమాదం ఏర్పడేదని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో మంటలు అర్పిన బంక్ సిబ్బందిని అంతా ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి :
Cow Smuggling : పుష్ప సినిమా సీన్…ఆవుల స్మగ్లింగ్ లో స్టన్నింగ్
Allu Arjun | టాలీవుడ్ కింగ్‌గా అల్లు అర్జున్.. వారందరిని వెనక్కి నెట్టి మరీ…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram