పది నెలలలో 43 సార్లు కరోన పాజిటివ్..వ్యక్తితో వైరస్ సయ్యాట
విధాత:పది నెలలలో 43 సార్లు కరోణ పాజిటివ్ ఫలితం వెలువడటంతో, డాక్టర్లు, పరిశోధకులు కూడా కంగుతిన్నారు బ్రిటన్‌లో ఓ వ్యక్తితో వైరస్ సయ్యాట బ్రిటన్‌లో 72 సంవత్సరాల ఓ వ్యక్తితో కొవిడ్ చెడుగుడులాడుకుంది. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా పది నెలల కాలంలో ఆయనకు కరోనా వస్తూ పోయింది. ఈ పది నెలల్లో ఆయన ఏడుసార్లు ఆసుపత్రిలో చికిత్సకు చేరాల్సి వచ్చింది. పలుసార్లు ఇక తన చావు ఖాయం అనుకుని ఆయన ఏకంగా అంత్యక్రియల ఏర్పాట్లు […]

విధాత:పది నెలలలో 43 సార్లు కరోణ పాజిటివ్ ఫలితం వెలువడటంతో, డాక్టర్లు, పరిశోధకులు కూడా కంగుతిన్నారు బ్రిటన్‌లో ఓ వ్యక్తితో వైరస్ సయ్యాట బ్రిటన్‌లో 72 సంవత్సరాల ఓ వ్యక్తితో కొవిడ్ చెడుగుడులాడుకుంది. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా పది నెలల కాలంలో ఆయనకు కరోనా వస్తూ పోయింది. ఈ పది నెలల్లో ఆయన ఏడుసార్లు ఆసుపత్రిలో చికిత్సకు చేరాల్సి వచ్చింది. పలుసార్లు ఇక తన చావు ఖాయం అనుకుని ఆయన ఏకంగా అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆత్మీయులు, బంధువులకు వీడ్కోలు కూడా తెలియచేసుకున్నాడు. అయితే కరోనా వస్తూ పోయింది కానీ ప్రాణాలను హరించలేదు. అయితే సుదీర్ఘకాలం కరోనా పట్టి పీడించిన వ్యక్తిగా పరిశోధకుల అధ్యయనంలో ఈ వ్యక్తి అపూర్వ రీతిలో నిలిచాడు. వెస్టర్న్ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన డావే స్మిత్ రిటైర్డ్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్.
కారణాలు తెలియదు కానీ ఆయనను కరోనా వైరస్ పట్టిపీడిస్తూ పోవడం, పది నెలలలో 43 సార్లు పాజిటివ్ ఫలితం వెలువడటంతో డాక్టర్లు, పరిశోధకులు కూడా కంగుతిన్నారు.
ఇంతకూ వైరస్ క్రమంలో ఉన్న బలహీనత ఏమిటీ? ఇన్నిసార్లు ఈ వ్యక్తికి కరోనా వచ్చిపోవడం వెనుక ఆయనలో ఉన్న బలం బలహీనతలు ఏమిటీ? అనేవి తేలాల్సి ఉంది.