సాహస క్రీడలతో జాగ్రత్త…ప్రాణాలు పోతాయ్ !

సాహస క్రీడల్లో జరిxo నిర్లక్ష్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారా సెయిలింగ్ చేస్తూ అస్ట్రేలియా వ్యాపారి కింద పడి మృతి చెందడం, బంగీ జంప్ చేసే క్రమంలో 'మరియా ఎడువార్డా' యువతి చనిపోవడంతో నెటిజన్లు ఈ తరహా క్రీడలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెక్కింగ్, పారా సెయిలింగ్ , పారాచూట్ ట్రావెలింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు ఒక్కోసారి తీవ్ర విషాదానికి దారితీస్తుంటాయి. ఇటీవల బ్రెజిల్ లైమీరా వద్ద ‘పాంటే డో ఎస్క్వెలిటో’ అనే వంతెనపై నుంచి బంగీ జంప్ చేసే క్రమంలో 21 ఏళ్ల ‘మరియా ఎడువార్డా’ ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది ఆమెకు సేఫ్టీ రోప్ కట్టకుండానే..130అడుగుల దిగువకు తోసివేయడంతో అక్కడిక్కడే మరణించడం విషాదం రేపింది.

అంతకుముందు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో పారాసెయిలింగ్ చేస్తూ ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త రోజర్ జాన్ హస్సీ 30 మీటర్ల ఎత్తు నుంచి పడి మృతి చెందారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే సెఫ్టీ హార్నెస్ సరిగా బిగించకపోవడం, కంట్రోల్ రోపుల్లో లోపం కారణంగా ఆయన కిందపడిన ఘటనను భార్య వీడియోలో రికార్డ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. బోట్ ఆపరేటర్, క్రూ సభ్యులపై నిర్లక్ష్యంతో మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేశారు. ఇలాంటి సాహస క్రీడల్లో జరిగిన నిర్లక్ష్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Latest News