అమెరికాలో ట్రంప్‌నకు ఎదురైన ‘కేజ్రీవాల్‌’!

ఆ రెండు నగరాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది! కానీ.. ఆ రెండింటికి ఎన్నికైన నాయకుల మధ్య ఒక సమీప్యత కూడా ఉంది. అది వారి ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ తత్వం! వారిద్దరి పేర్లు.. జోహ్రాన్‌ మమ్దానీ.. అరవింద్‌ కేజ్రీవాల్‌!

అమెరికాలో ట్రంప్‌నకు ఎదురైన ‘కేజ్రీవాల్‌’!

ఆ రెండు నగరాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది! కానీ.. ఆ రెండింటికి ఎన్నికైన నాయకుల మధ్య ఒక సమీప్యత కూడా ఉంది. అది వారి ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ తత్వం! వారిద్దరి పేర్లు.. జోహ్రాన్‌ మమ్దానీ.. అరవింద్‌ కేజ్రీవాల్‌! అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ మహానగరానికి జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక సంచలనం రేపింది. నిరాశా నిస్పృహల నుంచి, విద్య, వైద్య రంగాల్లో ఎఫర్డబిలిటీ కోసం న్యూయార్క్‌ నగరం చేసిన ఆలోచన జోహ్రాన్‌ ఎన్నికను సుసాధ్యం చేసింది. సరిగ్గా అవే తరహా ఆలోచనల నుంచి కేజ్రీవాల్ మొదటిసారి 2015లో ఢిల్లీ సీఎం పీఠం అధిరోహించారు. ఈ ఇద్దరూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంచుకుని సరికొత్త రాజకీయ దిశను చూపిన నేతలుగా నిలిచారు. న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికను, ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పోల్చలేకపోయినా.. వచ్చిన ఫలితం మాత్రం ఒక ఉమ్మడి అంశాలపైనే కావడం యాదృచ్ఛికం. ఆనాడు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా యావత్‌ కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించింది. నేడు మమ్దానీకి వ్యతిరేకంగా ఏకంగా ట్రంప్‌ రంగంలోకి దిగాడు. 2015లో ఢిల్లీలో 70 స్థానాల్లో 67 సీట్లను గెలిచిన కేజ్రీవాల్‌ను అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం మమ్దానిపై యుద్ధమే ప్రకటించారు.

Read More :  జోహ్రాన్‌ మమ్దానీ చేతికి ఉన్న మూడు ఉంగరాల కథేంటి?

ఈ ఇద్దరు నేతల మధ్య చాలా సామీప్యతలే కనిపిస్తాయి. మమ్దానీ 34 ఏళ్ల వయసులో న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైతే.. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి 46 ఏళ్ల యువకుడు. ఇద్దరూ తమ రాజకీయ జీవితాలను అత్యంత సాధారణ వ్యక్తులుగా ఉండి ప్రారంభించారు. ఇద్దరికీ పెద్ద పేరు ప్రఖ్యాతులు తొలి నాళ్లలో లేవు. కానీ.. ప్రజల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవితాలను మెరుగుపర్చడం ప్రధాన అజెండాగా నిలబడ్డారు. తమను మించిన శక్తులతో కలెబడి గెలిచారు.

నిజానికి న్యూయార్క్‌ అమెరికా వాణిజ్య రాజధాని అయినప్పటికీ.. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఆ మహానగరంలో జీవన ప్రమాణాలను మధ్యతరగతి, కార్మికవర్గం అందుకోలేక పోతున్నది. ఈ క్రమంలోనే ఇంటి అద్దెల నియంత్రణ, ఇంటిలో ఉండేవారికి హక్కులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నితావవసర వస్తువుల సరఫరా, ఉచిత లేదా రాయితీలతో కూడిన బస్సు ప్రయాణం, చిన్న పిల్లల సంక్షణ కేంద్రాలను ఉచితంగా నిర్వహించడం తదితర హామీలతో ఆయన చేసిన ప్రచారం.. సరిగ్గా ఇదే సమస్యలతో ఇబ్బందిపడుతున్న న్యూయార్కర్లను విశేషంగా ఆకర్షించింది. గతంలో కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ ప్రజలకు ఉచితంగా తాగునీటి సరఫరా, చౌకగా విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు, మొహల్లా క్లినిక్స్‌, అవినీతి నిర్మూలన తదితర వాగ్దానాలతోనే గెలిచారు. తర్వాత పదేళ్ల పదవీకాలంలో ఢిల్లీలో విద్య, వైద్య రంగాలు విప్లవాత్మక సంస్కరణలకు లోనయ్యాయి. మొత్తంగా ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. సామాజ్య ప్రజల జీవితాల్లో ఒక స్పష్టమైన మార్పును తీసుకురావడం.

ఇద్దరిపైనా లెఫ్టిస్టు ముద్రలు
జోహ్రాన్‌ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘కమ్యూనిస్టు’ ముద్ర వేశారు. ఇటు కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ అర్బన్‌ నక్సలైట్‌గా అభివర్ణించారు. కానీ.. ఇద్దరూ ఆ విమర్శలను అధిగమించారు. మమ్దానీ తనను తాను ‘సోషలిస్టు’గా గర్వంగా ప్రకటించుకోగా.. కేజ్రీవాల్‌ తనను ప్రజాసేవకుడిగా పరిచయం చేసుకున్నారు. ఇద్దరి దృష్టి ‘వ్యక్తులపై దాడి’ కాకుండా.. వ్యవస్థ మార్పుపై కేంద్రీకరించి ఉండటం గమనార్హం. వీరి రాజకీయ ప్రసంగాలు కూడా గంభీరమైనవి కాకుండా.. సామాన్యుల భాషలో నడిచేవి. అందుకే కేజ్రీవాల్‌ కామన్‌ మేన్‌గా పేరు పొందారు. జోహ్రాన్‌ సైతం అంతే సాధారణంగా కనిపిస్తారు. తాను కేవలం తనకు ఓటేసినవారి ప్రయోజనాల కోసమే కాకుండా.. ఓటు వేయనివారి ప్రయోజనాలు కాపాడేందుకూ ప్రయత్నిస్తానని చెప్పడం.. ప్రజాస్వామ్యానికి, నూతన ప్రజా రాజకీయాలకీ ఒక ప్రతిజ్ఞగా భావిస్తున్నారు. .