Air Force Training Jet Crashes | స్కూల్ భవనంపై కూలిన విమానం

Air Force Training Jet Crashes | స్కూల్ భవనంపై కూలిన విమానం

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ప్రమాదం
19మంది మృతి, 100మందికి గాయాలు

Air Force Training Jet Crashes | బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్లో FT-7BGI ఫైట్ జెట్ ఫ్లైట్ సోమవారం కూలిపోయింది. ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్(Milestone School and College) పై ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఫ్లైట్ కూలింది(Air Force Training Jet Crashes). విమానం కూలిన ప్రాంతం వద్ద రెస్క్యూ సిబ్బంది సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందగా 100మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఉండడంతో ప్రమాదం తీవ్రతరమయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ప్రమాదాన్ని బంగ్లాదేశ్(Bangladesh) వైమానిక అధికారులు ధృవీకరించారు. స్కూల్ పై విమానం కూలిపోవడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.